టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నెక్స్ట్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. F2 సినిమా తరువాత స్పీడ్ గట్టిగానే పెంచాడు. ప్రస్తుతం గని సినిమాతో పాటు F3 సినిమాను కూడా విడుదలకు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. అదే తరహాలో మరొక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ముందుగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న గని సినిమాను జూలై 30న విడుదల చేయనున్న వరుణ్ ఆ తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న F3 సినిమాను ఆగస్టు 27న విడుదల చేయనున్నాడు. ఆ సినిమాలో వెంకటేష్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ రెండు సినిమాలు పెద్దగా గ్యాప్ లేకుండా వస్తున్నాయి కాబట్టి ఆ తరువాత వచ్చే సినిమాకు కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకొని సినిమా హై రేంజ్ లో ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.
అందుకోసం టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుతో వర్క్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రవీణ్ నెక్స్ట్ అక్కినేని నాగార్జునతో ఒక సినిమా చేయడానికి కమిటైన విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత ఎలాగైనా వరుణ్ తేజ్ తో ఒక బిగ్ బడ్జెట్ సినిమాను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. మరి ఆ ప్లాన్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.