తమిళ డబ్బింగ్ చిత్రాలతో ఎక్కువగా ఫేమస్ అయింది వర్ష బొల్లమ్మ. అక్కడ సైడ్ క్యారెక్టర్లు చేసే వర్షకు తెలుగులో హీరోయిన్‌గా అవకాశాలు వస్తున్నాయి. 96, విజిల్ వంటి చిత్రాల్లో కనిపించి మెప్పించిన వర్ష.. తెలుగులో హీరోయిన్‌గా వరుసగా అవకాశాలు కొట్టేస్తోంది. మొదటగా చూసీ చూడంగానే అనే చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా అంతగా వర్కవుట్ అవ్వలేదు.
కానీ వర్ష రెండో ప్రయత్నంలో హిట్ కొట్టింది. ఈ మధ్య ఆనంద్ దేవరకొండతో కలిసి చేసిన మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే చిత్రంతో వర్ష హీరోయిన్‌గా నటించింది. సినిమా కూడా మంచి హిట్ అయింది. వర్షకు మంచి పేరు వచ్చింది. సినిమాకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం బాగా ప్లస్ అయింది. ఈ విషయంలో వర్షను అందరూ మెచ్చుకుంటున్నారు. అయితే ఇంత తక్కువ సమయంలో అంత తెలుగు ఎలా నేర్చుకుందో తాజాగా బయట పెట్టేసింది.
తనకు తెలుగు అంతగా రాదని కానీ సినిమా షూటింగ్ మొదలెట్టాక ఎప్పుడూ తెలుగులోనే మాట్లాడేందుకు ప్రయత్నించేదాన్ని అని చెప్పుకొచ్చింది. డ్రైవర్ అన్నతో, మేకప్ వేసే అన్నతో తెలుగులో మాట్లాడుతూ ప్రాక్టీస్ చేసేదాన్ని అలా కొంచెం కొంచెం అలవాటైందని పేర్కొంది. ఎవరైనా నవ్వినా కూడా పట్టించుకునేదాన్ని కాదని తెలిపింది. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమా సక్సెస్ జోష్‌లో ఉంది.