మెగా హీరోలు ఎక్కువగా ఇతర హీరోలను పొగడటం చూసి ఉండరు. అయితే మెగా హీరోలు అందరితోనూ కలిసిమెలిసి ఉంటారు. అందరూ కలిసి పార్టీలు చేసుకుంటారు. పైగా వారంతా కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా ఉంటారు. అయితే తాజాగా వైష్ణవ్ తేజ్ మహేష్ బాబు, అతని సినిమాల గురించి కామెంట్ చేశాడు.తాను అందరి సినిమా చూస్తానని కానీ వారిలా అవ్వాలని అనుకోనంటూ చెప్పుకొచ్చాడు.
పెద్ద హీరోల సినిమాలకు బెనిఫిట్ షోలకు వెళ్లాలని నాకు ఉంటుంది. కానీ, అంత మంది జనంలో వెళ్లలేను. ‘భరత్ అనే నేను’లో మహేష్ బాబు హెలికాప్టర్ దిగి వస్తోన్నప్పుడు స్లో మోషన్‌లో షాట్ ఉంటుంది.. అది ఇప్పటికీ నాకు గుర్తుంది. జూనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్స్ వింటుంటే గూస్ బంప్స్. ఏ హీరో అయినా నాకు ఆ జానర్ నచ్చిందంటే చాలు అందులో లీనమైపోతాను. రీసెంట్‌గా ‘మాస్టర్’ చూశాను. అనిరుధ్ గారు బీజీఎం అద్భుతంగా ఇచ్చారు. ఏ హీరో అయినా థియేటర్‌కు వెళ్లి చూడాలనిపిస్తుందంటూ వైష్ణవ్ తేజ్ చెప్పుకొచ్చాడు.
ఉప్పెన ప్రమోషన్స్‌లొ భాగంగా వైష్ణవ్ తేజ్ మాట్లాడిన మాటలు బాగానే వైరల్ అవుతున్నాయి. మొదటి సారిగా హీరోగా తనని తాను చూసుకోబోతోన్నాడు వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమాపై అందరికీ అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఫిబ్రవరి 12న రాబోతోన్న ఈ మూవీ గురించి అటు ఇండస్ట్రీ ప్రముఖులు ఇటు మెగా ఫ్యాన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.