కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఆచార్య సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మాట్నీ మూవీస్ బ్యానర్స్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిరు కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా కొరటాల శైలిలో సామాజిక అంశంతో పాటు మంచి సందేశంతో తెరకెక్కుతుంది.
ఈ సినిమా తర్వాత మెగాస్టార్ బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలలో నటించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్స్ కి సంబంధిన న్యూస్ కూడా ఇప్పటికే వచ్చేశాయి. ఈ సినిమాలలో మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ గా రూపొందుతుంది. మాస్ డైరెక్టర్ వి.వి వినాయక్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన అధికారక ప్రకటన అక్టోబర్ మొదటి వారంలో రానుందని సమాచారం.
అంతేకాదు 2021 మార్చ్ నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతుందని సమాచారం. అయితే చాలాకాలం తర్వాత వినాయక్ కి మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. అంతేకాదు మెగాస్టార్ చేస్తున్న మూడవ రీమేక్ సినిమా కి వినాయక్ నే ఎంచుకోవడం కూడా ఆసక్తికరం. గతంలో వచ్చిన ఠాగూర్ తమిళ సూపర్ హిట్ రమణ కి రీమేక్ గా తెరకెక్కించాడు వినాయక్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ సున్నామీని సృష్ఠించింది. అలాగే మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ఖైదీనంబర్ 150 కూడా తమిళ సూపర్ హిట్ సినిమా కత్తి కి రీమేక్.
అలాగే ఇప్పుడు మూడవసారి మెగాస్టార్ – వినాయక్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కూడా మలయాళ సూపర్ హిట్ లూసీఫర్ కి రీమేక్ కావడం, అలాగే ఇద్దరి కాంబినేషన్ లో తీరకెక్కబోతున్న హ్యాట్రిక్ సినిమా కావడం విశేషం. ఈ మధ్య సరైన సక్సస్ లేక కసిగా ఉన్న వినాయక్ భారీ హిట్ కోసం మెగాస్టార్ ని అన్ని రకాలుగా కాస్త ఇబ్బంది పెట్టబోతున్నాడని అంటున్నారు. తప్పదు మరి హ్యాట్రిక్ హిట్ పడాలంటే ఇద్దరు కష్టపడాల్సిందే అంటున్నారు అభిమానులు. ఇక వినాయక్ లోని ఫైర్ చూస్తే ఠాగూర్ కంటే భారీ హిట్ ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నాడనిపిస్తుంది.