నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు తొలిసారి కలిసి నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ `వి`. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్, హర్షత్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5న దాదాపు 200 దేశాల్లో అమెజాన్ ప్రైమ్ రిలీజ్ చేస్తోంది. ఇటీవల విడుదలైన `వి` ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. యూట్యూబ్‌లో ఇప్పటికే 11 మిలియన్ వ్యూస్‌ని దాటి సంచలనం సృష్టిస్తోంది.
నాని నటించిన చిత్రాల్లో అత్యదిక శాతం వీక్షించిన ట్రైలర్‌గా రికార్డుని సాధించబోతోంది. కరోనా కారణంగా గత ఆరు నెలలుగా రిలీజ్‌కు నోచుకోని ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు ఎట్టకేలకు అమెజాన్ ప్రైమ్‌లో భారీ ఆఫర్ రావడంతో రిలీజ్ చేస్తున్నారు. లాక్‌డౌన్ మొదలైన దగ్గరి నుంచి ఇప్పటి వరకు ఓటీటీ ప్లాట్ ఫామ్‌లలో చాలా చిత్రాలు విడుదలయ్యాయి. కానీ తొలి సారి ఓ క్రేజీ చిత్రం విడుదల కానుందడంతో `వి` చిత్రం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
ఇప్పటికే రిలీజైన ఈ మూవీ ట్రైలర్ 11 మిలియన్ వ్యూస్‌ని దాటడంతో ఈ మూవీకి తొలి రోజు వ్యూస్ సునామీ గ్యారెండీ అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులని బట్టి అమెజాన్ ప్రైమ్‌లో వ్యూస్ పరంగా `వి` చిత్రం రికార్డుల్ని తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమా వ్యూస్ పరంగా సృష్టించబోయే సునామీని కళ్లారా చూసేందుకు ప్రొడ్యూసర్స్, స్టార్స్, డైరెక్టర్స్ ఎదురుచూస్తున్నారు. `వి` ఖచ్చితంగా డిజిటల్ రంగంలో సరికొత్త ట్రెండ్‌ని సృష్టించడం ఖయం అని ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.