నాని మీద వి సినిమా ఎఫెక్ట్ .. దెబ్బకే ఆ సినిమాని వదిలేసిన మేకర్స్ ..?

నేచురల్ స్టార్ ని టైం ఇప్పుడు అంతగా బాగాలేదని అంటున్నారు. ఎన్నో అంచనాలు, ఆశలు పెట్టుకొని చేస్తున్న సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద డీలాపడుతున్నాయి. చెప్పాలంటే నిన్నుకోరి సినిమా తర్వాత బ్లాక్ బస్టర్ గా చెప్పుకున్న సినిమా ఏదీ లేదనే అంటున్నారు. గ్యాంగ్ లీడర్, జెర్సీ, వి సినిమాల మీద ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాని ఆ సినిమాలు కమర్షియల్ గా సక్సస్ కాకపోవడంతో ప్రేక్షకులు కూడా బాగా డిసప్పాయింట్ అవుతున్నారు. ఇక మేకర్స్ కూడా కాస్త ఆలోచనలో పడ్డారని మాట్లాడుకుంటున్నారు.

Tollywood: Nani's V will be out on this day?

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని నటించిన సినిమా వి. ఈ సినిమాలో సుధీర్ బాబు, నివేదా థామస్, అదితీ రావు హైదరీ కూడా నటించిన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మించాడు. ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. అయితే ఆ ప్రభావం ఇప్పుడు నాని నటించబోతున్న ఒక తాజా చిత్రం మీద పడిందని అంటున్నారు.

ఈ సినిమా తర్వాత నాని వరసగా నాలుగు ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టాడు. వాటిలో శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న టక్ జగదీష్ ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకొని ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ సినిమా తర్వాత మొదలవ్వాల్సిన ‘శ్యామ్ సింగ రాయ్’ కి ఇబ్బందులు వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. సితార ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నట్టు ముందు ప్రకటన వచ్చిన సందరికీ తెలిసిందే.

Shyam Singh Roy: Change of production house?

అయితే ఇప్పుడు ఈ బ్యానర్ లో ‘శ్యామ్ సింగ రాయ్’ నిర్మించడం లేదన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ నిర్మాణ సంస్థ తప్పుకోగా వెంకట్ బోయనపల్లి ఈ సినిమాకి నిర్మాణ బాధ్యతలు తీసుకున్నట్టు సమాచారం. కాగా టాక్సీవాలా సినిమాతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించనున్నాడు.