ఈ బాలీవుడ్ బ్యూటీని ఐటం సాంగ్ కి అనుకుంటే ఏకంగా హీరోయిన్ గా దిగింది.. !

urvasi routhela Entry in Tollywood

ఊర్వశి రౌతెలా.. బాలీవుడ్ లో చేసింది చాలా తక్కువ సినిమాలు. కాని మంచి క్రేజ్ సంపాదించుకుంది. చేసిన సినిమాలన్ని హిట్ గా నిలిచాయి. దానికి తోడు అదిరిపోయే ఫిగర్. బాలీవుడ్ లోనే కాదు సౌత్ మొత్తం ప్రేక్షకుల్లో బాగా పాపులారిటీని సంపాదించుకుంది. సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్. 2013 లో సింగ్ సాబ్ ది గ్రేట్ సినిమాతో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంటరైంది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆ తర్వాత సనమ్ రే, గ్రేట్ గ్రాడ్ మస్తీ, హేట్ స్టోరీ 4, పాగల్ పంటి అన్న సినిమాలు చేసి స్టార్ డం ని సంపాదించుకుంది.

urvasi routhela Entry in Tollywood
urvasi routhela Entry in Tollywood

దీంతో టాలీవుడ్ మేకర్స్ కన్ను ఊర్వశి రౌతెలా మీద పడింది. చాలామంది మేకర్స్ టాలీవుడ్ లో పెద్ద సినిమాలలో స్పెషల్ సాంగ్ కోసం తీసుకోవాలని భావించారు. కాని ఏ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. అయితే అల్లు అర్జున్ సినిమాలో మాత్రం ఖచ్చితంగా ఐటెం సాంగ్ కోసం హైదరాబాద్ రాబోతుందని ప్రచారం జరిగింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పుష్ప అన్న పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిదే. ఈ సినిమాలోనే దేవీశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసే ఐటం సాంగ్ లో అల్లు అర్జున్ తో నర్తించబోతుందని చెప్పుకున్నారు. తీరా చూస్తే ఈ బ్యూటీ షాకిచ్చింది.

Urvashi Rautela On Shooting Black Rose Amid The 'New Normal': "It's A  Difficult Time But Work Has To Go On"

ఐటం సాంగ్ కోసం తీసుకు రావాలని తెగ ప్రయత్నాలు చేసిన మేకర్స్ అందరికి సర్‌ప్రైజ్ గా దర్శకుడు సంపత్ నంది నిరాణంలో రూపొందుతున్న బ్లాక్ రోజ్ అన్న సినిమాతో ఏకంగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. రొమాంటిక్, థిల్లర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాకి మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. మణి శర్మ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ‘ నా తప్పు ఏమున్నదబ్బా ‘ అన్న సాంగ్ రిలీజై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నాడు.