” ఉప్పెన ” లా దూసుకొస్తున్న కృతి శెట్టి.. ఇక ఆ హీరోయిన్స్ సర్ధుకోవాల్సిందే ..?

మెగా మెనల్లుడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ఉప్పెన ద్వారా టాలీవుడ్ కి పరిచయమవుతోంది కృతి శెట్టి. సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. వాస్తవంగా ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా లాక్ డౌన్ మూలంగా ఆగిపోయింది.

Krithi Shetty Height, Weight, Age, Boyfriend, Biography & Family

అయితే ఈ సినిమాలో ఉన్న ‘నీ కన్ను నీలి సముద్రం’ అన్న సాంగ్ మాత్రం బాగా ట్రెండ్ అయింది. ఈ ఒక్క సాంగ్ సినిమా మీద భారీ అంచనాలు పెంచేసింది. అంతేకాదు ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ కి జంటగా నటించిన కృతి శెట్టి కూడా బాగా పాపులర్ అయింది. ఈ ఒక్క సాంగ్ తో ప్రేక్షకులనే కాదు టాలీవుడ్ యంగ్ హీరోల తో పాటు మేకర్స్ దృష్ఠిని బాగా ఆకర్శించింది.

Nani welcomes Sai Pallavi and Krithi Shetty to Shyam Singha Roy cast. See  new poster - Movies News

ఆ కారణంగానే ఇప్పుడు నేచురల్ స్టార్ నాని నటించబోతున్న శ్యామ్ సింఘరాయ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఎంపికయింది. దసరా పండుగ సందర్భంగా మేకర్స్ ఈ సినిమా నుంచి పోస్టర్ ని రిలీజ్ చేస్తూ హీరోయిన్స్ తో పాటు డిసెంబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభం కానున్నట్టు ప్రకటించారు. ముందు నుంచి అనుకుంటున్నట్టుగా సాయి పల్లవి ఒక హీరోయిన్ గా నటిస్తుండగా కృతి శెట్టి ని మరో హీరోయిన్ గా ఎంచుకున్నారు.

ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే శ్యామ్ సింఘరాయ్ లో కృతి శెట్టి కి అవకాశం రావడం చూస్తుంటే ఇప్పుడు ఉన్న కొంతమంది హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇవ్వబోతుందని మాట్లాడుకుంటున్నారు. సాధారణంగా ఫాం లో ఉన్న హీరోయిన్స్ కి కొత్త హీరోయిన్స్ వచ్చి చెక్ పెట్టడం సహజం. అదే మాట ఇప్పుడు కృతి శెట్టి విషయంలోను వినిపిస్తుంది. చూడాలి మరి కృతి శెట్టి ఎంతకాలం టాలీవుడ్ లో కొనసాగుతుందో.