దర్గాకి వెళ్ళిన రామ్ చరణ్ పై ఇన్ని విమర్శలా?.. తన భర్త జోలికి వచ్చిన వారిపై సూపర్ కౌంటర్ ఇచ్చిన ఉపాసన!

దర్గాకి రావడం వల్ల విమర్శలు ఎదుర్కొంటున్న రామ్ చరణ్. కొన్నాళ్ల క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కడప దర్గాలో జరిగే 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్ కి హాజరవుతానని ఏఆర్ రెహమాన్ కు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే ఈ సంవత్సరం కడప దర్గా కి వచ్చి తన మాట నిలబెట్టుకున్నారు రామ్ చరణ్. కానీ ఆ సమయంలో చరణ్ అయ్యప్ప మాలలో ఉండడం వలన మాలలోనే దర్గాకు వచ్చారు.

గతంలో కూడా పలు సినీ నటులు కడపలో ఉన్న దర్గాను విచ్చేశారు కానీ వారిపై ఎలాంటి విమర్శలు రాలేదు. కానీ రామ్ చరణ్ అయ్యప్ప మాల లో ఉండి కూడా దర్గాకి రావడం వల్ల హిందువులందరూ చరణ్ పై తమ ఆగ్రహాన్ని చూపిస్తున్నారు. ఒక హిందువుడు అయ్యుండి దర్గాకు స్వామి మాలలో వెళ్ళడమేంటి? దర్గాను సమాధిలా భావిస్తారు అలాంటిది మాల వేసుకుని సమాధికి వెళ్లడం అంటే అది హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్టే కదా అంటూ విమర్శలు చేస్తున్నారు.

ఎంతో పవిత్రంగా భావించే అయ్యప్ప మాలను అలాంటి దర్గాకి వేసుకొని వెళ్లడం చాలా పెద్ద తప్పు, దీనిపై చరణ్ వెంటనే స్పందించాలి, అలాగే అయ్యప్ప భక్తులతో పాటు మొత్తం హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలి అని కొందరు డిమాండ్ చేశారు. దీనిపైన రామ్ చరణ్ ఎటువంటి స్పందన ఇవ్వలేదు కానీ ఆయన భార్య అయిన ఉపాసన స్పందిస్తూ,

దేవుడిపై విశ్వాసం అనేది అందరిని ఒకటి చేస్తుంది అంతేతప్ప భారతీయులను విడగొట్టదు. మన బలం ఐక్యమత్యంగా ఉండడం. మన మతాన్ని అనుసరిస్తూ ఇతర మతాలను గౌరవించడమే సనాతన ధర్మంను పాటించడం అవుతుంది #onenationonespirit #JaiHind అని హాష్ టాగ్ని షేర్ చేశారు. ఆ మెసేజ్ తో చరణ్ పై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరికి ఒక సూపర్ కౌంటర్ ను ఇచ్చి అందరు నోరులు మూయించారు ఉపాసన.