రామ్ చరణ్ పై ఉపాసన బ్యూటిఫుల్ పోస్ట్ వైరల్..!

తెలుగు సినిమా దగ్గర కొన్ని అందమైన సెలెబ్రెటీ జంటల్లో మెగా హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన కొణిదెలల కాంబినేషన్ కూడా ఒకటి. కాగా ఈ జంటపై అప్పట్లో పలు విమర్శలు ట్రోల్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న ఒక బ్యూటిఫుల్ జంటలలో ఒకరిగా వీరు నిలిచారు.

కాగా వీరిద్దరూ ఇటీవల తల్లిదండ్రులు కూడా అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో మెగా ఇంట ఇప్పుడు అంతా హ్యాపీ మూమెంట్స్ నడుస్తున్నాయి. అయితే రామ్ చరణ్ ఉపాసన ఎంత ఆనందంగా తమ లైఫ్ లీడ్ చేస్తున్నారు? ఒకరినొకరు ఎంతలా అర్ధం చేసుకున్నారు అనేది ఉపాసన చేసిన తాజా పోస్ట్ చూస్తే అర్ధం అవుతుంది.

రీసెంట్ గా వీరిద్దరిది ఓ నేషనల్ మ్యాగజైన్ పిక్ బయటికి వచ్చి వైరల్ గా మారగా ఈ మ్యాగజైన్ పిక్ తో రామ్ చరణ్ పై బ్యూటిఫుల్ పోస్ట్ పెట్టింది. ఆమె మాట్లాడుతూ “అంతా ప్రతి మగాడి విజయం వెనుక తన ఆడది ఉంటుంది అని అంటారు, కానీ నా విజయం వెనుక నన్ను ఎంతో ప్రోత్సహించే నా భర్త ఉన్నాడు అని నేను చెప్తా” అని ఆమె తెలిపింది.

దీనితో ఈమె నుంచి ఈ పోస్ట్ చూసిన మెగా ఫ్యాన్స్ మరింత ఆనందం వ్యక్తం చేస్తూ ఉపాసనపై మరింత గౌరవాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓ హీరోగానే కాకుండా మంచి వ్యక్తిగానే కాకుండా మంచి భర్తగా కూడా రామ్ చరణ్ మార్కులు అందుకోవడంతో ఈ పోస్ట్ ఇపుడు వైరల్ గా మారింది.