ఆ కమ్యూనిటీ అంటే గౌరవం అంటూ ట్రాన్స్ జెండర్ ల గురించి ఎమోషనల్ అయినా మెగా కోడలు?

మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ గా మాత్రమే కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటూ యాక్టివ్ గా ఉంటారు. ఈమె సోషల్ మీడియా వేదికగా ఎన్నో పౌష్టికాహారం పోషక విలువల గురించి అందరికీ తెలియజేస్తూ ఉంటారు.ఇలా ఒక వైపు మెగా కుటుంబం బాధ్యతలను అలాగే అపోలో హాస్పిటల్ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నటువంటి ఉపాసన గురించి మెగాస్టార్ ఎన్నోసార్లు ఆమెపై ప్రశంసలు కురిపించారు.

ఈ క్రమంలోనే ఉపాసన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ క్రమంలోనే తన పెళ్లి జరిగి 8 సంవత్సరాలు అవుతున్న పిల్లలు వద్దనుకోవడానికి కారణం ఏంటి అనే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పారు. ఇకపోతే తాజాగా ఈమె తన ఫ్రెండ్ ఒక ట్రాన్స్ జెండర్ అని తనతో తనకి మంచి అనుబంధం ఉందని ఇంటర్వ్యూలో చెప్పిన ఉపాసన తాజాగా తనతో కలిసి దిగినటువంటి ఫోటోని షేర్ చేస్తూ ట్రాన్స్జెండర్ కమిటీ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే తన తన ఫ్రెండ్ ట్రాన్స్జెండర్ లక్ష్మీనారాయన్ తో కలిసి దిగిన ఫోటోలు ఈమె షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

ప్రస్తుతం ఉపాసన సోదరి అనుష్ పాలా వివాహం కావడంతో ఆమె ఇంటిలో పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఈ వివాహ కార్యక్రమంలో భాగంగా ట్రాన్స్ జెండర్ ల ను ఉపాసన తన ఇంటికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇలా తన సోదరి పెళ్లి వేడుకలను ప్రారంభించినందుకు ఈమె ట్రాన్స్జెండర్ లక్ష్మీనారాయన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జీవితాన్ని పరిపూర్ణంగా ఎలా బ్రతకాలో నేర్పించారు హైదరాబాద్ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ ఎత్నిక్ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ అంటే తనకు అపారమైన గౌరవం ఉందని అందులో ప్రతి ఒక్కరి వెనుక అద్భుతమైన కథ ఉందని అలాంటి వారితో ఇంత సన్నిహితంగా మెలిగే అవకాశం వచ్చినందుకు ఆమె కృతజ్ఞత తెలుపుతూ పోస్ట్ చేశారు.