ఉపాసన ఇలా కూడా చేస్తుందా.. డార్లింగ్ అంటూ చెర్రీపై కామెంట్

Upasana and Ram Charan Special Post On 2021

మామూలుగా అయితే మెగా ఫ్యామిలీ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ఓ రేంజ్‌లో జరిగేవి. కానీ ఈ సారి మాత్రం ఆ ఈవెంట్‌ను కరోనా దెబ్బ కొట్టింది. దీంతో ఎక్కడి వాళ్లు అక్కడే గప్ చుప్ అన్నట్టుగా కానిచ్చారు. అందులో ముఖ్యంగా రామ్ చరణ్ ఉపసాన మాత్రం విడిగా క్వారంటైన్‌లో ఉన్నారు. రామ్ చరణ్ తనకు పాజిటివ్ అని ప్రకటించిన క్షణం నుంచి ఉపాసన కూడా చెర్రీతో పాటే క్వారంటైన్‌లో ఉంటోంది. అలా ఇద్దరూ కలిసి అమూల్యమైన సమయాన్ని గడుపుతూ ఉన్నారు.

Upasana and Ram Charan Special Post On 2021
Upasana and Ram Charan Special Post On 2021

మరో వైపు వరుణ్ తేజ్ కూడా కరోనా బారిన పడ్డాడు. ఇలా మెగా ఫ్యామిలీకి కరోనా భయం పట్టుకుంది. దీంతో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ లేకుండానే పోయింది. అయితే హ్యాపీ న్యూ ఇయర్ అంటూ తమ అభిమానులకు మాత్రం పోస్ట్‌లు పెడుతూనే ఉన్నారు. అందులో భాగంగా ఉపాసన ఓ రెండు ఫోటోలను పెట్టింది. చెర్రీ, ఉపాసనలు మాట్లాడుకుంటూ ఉన్నట్టుగా ఆ రెండు ఫోటోలను షేర్ చేసింది. మాటల్లో కాకుండా ఇలా ఫోటోల్లోనే చెప్పేసింది.

డల్‌గా ఉన్న ఉపాసన, ఏదో అడుగుతున్నట్టుగా ఉన్న చెర్రీ ఫోటోను ఉపాసన షేర్ చేసింది. ఉప్సీ ఈ ఏడాది ఎలా గడిచింది అని చెర్రీ అడుగుతున్నాడట. డార్లింగ్ నువ్ నా మొహాన్ని చూడటం లేదా.. అదే ఎంతో చెబుతుంది అని ఉపాసన కౌంటర్ వేసినట్టుగా ఉంది. ఇక రెండో ఫోటోలో ఉపాసన నవ్వులు చిందిస్తూ ఉంది. కనీసం 2021 అయినా బాగుంటుందని ఆశిస్తున్నా అంటూ ఉపాసన చెప్పుకొచ్చింది. మొత్తానికి ఉపాసన తమ మీద ఓ మీమ్ వేసుకుని అందరినీ నవ్వించేసింది.