ఈ ట్విస్ట్ ఏంది పుష్పా.!

‘వేర్ ఈజ్ పుష్ప.?’ అంటూ లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన వీడియోతో ఆడియన్స్‌లో అమితమైన ఆసక్తి క్రియేట్ చేశాడు సుకుమార్. ఇప్పుడిదే ట్రెండింగ్ అయ్యి కూర్చుంది. బన్నీ బర్త్ ‌డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ వీడియో రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకుంటోంది. ఇదిలా వుంటే, తాజాగా ఇంకో గాసిప్ ‘పుష్ప 2’పై చక్కర్లు కొడుతోంది.

‘పుష్ప 2’లో అల్లు అర్జున్ డబుల్ రోల్ అనీ ప్రచారం జరుగుతోంది. అండర్ కవర్ ఆఫీసర్‌గా ఓ పాత్ర వుంటుందట. ‘పోకిరి’ టైప్‌లో ఆ పాత్రకు సంబంధించి అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వనున్నారనీ తెలుస్తోంది.

ఈ తాజా గాసిప్ ‘పుష్ప 2’పై ఇంతవరకూ వున్న అంచనాల్ని అమాంతం పెంచేసింది. లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన వీడియోని బట్టి.. అవును కదా.! నిజమే కదా.! అలాక్కూడా జరగొచ్చు కదా.. అని ఆడియన్స్ ‘పుష్ప 2’ కథని తమకు తోచినట్లుగా ఇమేజినేషన్ చేసేసుకుంటున్నారు.

మొత్తానికి సుకుమార్ భలే స్కెచ్ వేశాడులే. జరుగుతున్న గాసిప్స్‌లో నిజమెంతో తెలీదు కానీ, సక్సెస్ ఫార్ములాని అప్పుడే జనంలోకి వదిలేశాడు. చూడాలి మరి, ఎంత మేర వర్కవుట్ అవుతుందో.!