అనుష్క శెట్టి విషయంలో ఎవరూ ఊహించని ట్విస్ట్ ..ఆ రోజు బద్దలైపోవాల్సిందే ..!

అనుష్క శెట్టి టాలీవుడ్ లో చాలా లాంగ్ జర్నీ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా హీరోయిన్స్ కి ఇండస్ట్రీలో లైఫ్ టైం తక్కువన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాని అనుష్క కి ఉన్న క్రేజ్ అండ్ స్టార్ డం దృష్ఠ్యా ఇప్పటికి క్రేజీ ప్రాజెక్ట్స్ లో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు అనుష్క తను చేసే ప్రతీ సినిమాని చాలా జాగ్రత్తగా ఎంచుకుంటోంది. అనుష్క కి తెలుగులోనే కాకుండా తమిళంలోను విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.

Changes happen slowly in a million moments that look the same: Anushka  Shetty | Telugu Movie News - Times of India

ఇటీవలే అనుష్క నటించిన నిశ్శబ్ధం ఓటీటీలో రిలీజైన సంగతి తెలిసిందే. రిజల్ట్ సంగతి పక్కన పెడితే అనుష్క కి మాత్రం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. పర్ఫార్మెన్స్ పరంగా అనుష్క మెస్మరైజ్ చేసింది. అంతేకాదు మాధవన్ లాంటి వాళ్ళు ఉన్నప్పటికి సినిమాకి అనుష్క నే హైలెట్ గా నిలిచింది. ఓటీటీలో ఇంకా ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఉన్నారు. చెప్పాలంటే ఒక వర్గం ప్రేక్షకులు ఈ సినిమాలో అనుష్క మూగ, చెవిటి యువతిగా నటించినందుకు ప్రశంసలతో ముంచేస్తున్నారు.

అయితే ఇన్నాళ్ళు అనుష్క నిశ్శబ్ధం సినిమా రిలీజయ్యాక నెక్స్ట్ సినిమా గురించి అనౌన్స్ చేస్తుందని భావించారు. కాని ఈ సినిమా రిలీజై ఇన్ని రోజులు అవుతున్నా కూడా తన నెక్స్ట్ సినిమా ప్రకటించకపోవడం అందరికీ షాకింగ్ గా మారింది. అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం నవంబర్ 7 న అనుష్క శెట్టి బర్త్ డే సందర్భంగా తన కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించిన విషయాలు రివీల్ చేసి భారీ స్థాయిలో షాకివ్వబోతుందని తెలుస్తుంది.

ఇప్పటికే తమిళంలో సూర్య – దర్శకుడు హరి కాంబినేషన్ లో వచ్చిన సింగం సిరీస్ లో కొత్త భాగాన్ని రూపొందించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అనుష్క ని హీరోయిన్ గా తీసుకోనున్నారట. అలాగే గౌతం మీనన్ – కమల్ హాసన్ కాంబినేషన్ లో రూపొందనున్న సినిమాలో కూడా అనుష్క పేరు పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇక ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తాజాగా శాకుంతలం అన్న ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశాడు. ఈ సినిమాలో శాకుంతల గా అనుష్క ని ఎంచుకోబోతున్నట్టు ఈ సినిమా అధికారక ప్రకటన అనుష్క బర్త్ డే అయిన నవంబర్ 7 న రానుందని సమాచారం.