Un Stoppable: నా సెట్ లోకి నిన్ను రానివ్వను బ్రో…. రామ్ చరణ్ కు షాక్ ఇచ్చిన బాలయ్య?

Un Stoppable: బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ఎపిసోడ్ షూటింగ్ నేడు జరిగింది ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్ స్టాపబుల్ సీజన్ ఫోర్ కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతుంది ఇప్పటివరకు కొన్ని ఎపిసోడ్స్ ప్రసారమయ్యాయి అయితే ఈ టాక్ షో కి ఎక్కువగా సినిమా ప్రమోషన్ల నిమిత్తం హీరోలు రావటం జరుగుతుంది.

ఇక త్వరలోనే రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రామ్ చరణ్ బాలకృష్ణ టాక్ షోలో సందడి చేశారు అయితే తాజాగా రాంచరణ్ వచ్చారనే విషయం తెలుసుకున్న బాలయ్య తనని ఇన్వైట్ చేయడం కోసం వచ్చారు అయితే బాలకృష్ణని చూడగానే రామ్ చరణ్ రెండు చేతులను జోడించి నమస్కారం చేయబోయారు. ఇక బాలయ్య మాత్రం నిన్ను నా సెట్లోకి రానివ్వను బ్రో అంటూ సరదాగా వేలు చూపించారు.

ఇలా రామ్ చరణ్ చేతులు జోడించి ఆయనకు నమస్కరిస్తూ ఉండగా బాలయ్య మాత్రం బ్రో ఇలాంటివి వద్దు అంటూ తనని ఏకంగా హగ్ చేసుకుని సాదరంగా సెట్ లోకి ఆహ్వానించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక మొదటిసారి రామ్ చరణ్ ఈ కార్యక్రమానికి రావడంతో బాలకృష్ణ రామ్ చరణ్ ను ఎలాంటి ప్రశ్నలు వేయబోతున్నారు ఈయన గురించి అడిగి తెలుసుకోవడానికి ఏ హీరోలకు ఫోన్ కాల్స్ చేయబోతున్నారు అనే విషయంపై ఎంతో ఆసక్తి నెలకొంది.

ఇక రాంచరణ్ సినిమా జనవరి 10వ తేదీ విడుదల కాగా బాలకృష్ణ నటించిన డాకు మహారాజా సినిమా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలా ఇద్దరు హీరోలు సంక్రాంతి బరిలో పోటీకి సై అంటున్నారు.