ఉదయ్ కిరణ్ వదిలేసిన సినిమా మహేష్ కి భారీ హిట్..!

టాలీవుడ్ సినిమా దగ్గర ఒక వెలుగు వెలిగిన యంగ్ హీరోస్ లో దివంగత హీరో ఉదయ్ కిరణ్ కూడా ఒకడు. మరి ఉదయ్ కిరణ్ తాను కెరీర్ స్టార్ట్ చేసిన సమయంలో పలు సెన్సేషనల్ హిట్ లు అందుకొని అసలు ఎవరు ఈ యువ హీరో అని టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలిచాడు.

అయితే మరో పక్క అప్పటికే ఎస్టాబ్లిష్ అవుతున్న స్టేర్ హీరో కొడుకులు వారసులుగా వచ్చిన హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. మరి తాను నటించిన అప్పటి చిత్రాల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేసిన సూపర్ హిట్ చిత్రం “అతడు” కూడా ఒకటి. అయితే ఈ చిత్రం విషయంలో ఇప్పుడు ఓ షాకింగ్ అంశం బయటకి వచ్చింది.

టాలీవుడ్ ప్రముఖ నటుడు నిర్మాత అయినటువంటి మురళీమోహన్ రీసెంట్ గా మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. తాము ఈ చిత్రాన్ని మొదటిగా ఉదయ్ కిరణ్ తోనే ప్లాన్ చేశామని కానీ అతను చేయకపోయేసరికి అప్పుడు సినిమా మహేష్ బాబు దగ్గరకి వెళ్ళింది అని చెప్పారు. దీనితో ఊహించని ఫ్యాక్ట్ ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది.

అయితే దీంతో పాటుగా అసలు ఈ సినిమా కథ మొదటిగా త్రివిక్రమ్ చెప్పిందే పవన్ కళ్యాణ్ కి కదా ఈ కథ చెప్తేనే పవన్ నిద్రపోయాడు అని త్రివిక్రమ్ అప్పుడెప్పుడో తానే స్వయంగా చెప్పారు. మరి మళ్ళీ సడెన్ గా ఉదయ్ కిరణ్ పేరుని తీసుకురావడం అయితే ఇప్పుడు ఆసక్తిగా మారింది.