Udaya Bhanu: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ ఎవరు అంటే అందరికీ టక్కున సుమా కనకాల పేరు గుర్తుకు వస్తారు. ప్రస్తుతం ఏదైనా సినిమా వేడుక జరిగింది అంటే ఆ సినిమా పూజ కార్యక్రమాల నుంచి మొదలుకొని విడుదల అయ్యి సక్సెస్ మీట్ కార్యక్రమం వరకు సుమా అక్కడ ఉండాల్సిందే. ఇలా సుమ యాంకర్ గా వ్యవహరిస్తే ఆ కార్యక్రమానికి మరింత ప్రమోషన్ చేకూరుతున్న నేపథ్యంలో ఎంతోమంది నిర్మాతలు సుమ కాల్ షీట్స్ కోసం ఎదురుచూస్తూ తమ సినిమా వేడుకలను నిర్వహిస్తూ ఉంటారు.
ఇలా ప్రస్తుతం సుమకు ఉన్నటువంటి క్రేజ్ ఒకప్పుడు మరో యాంకర్ కి సైతం ఉండేది. అప్పట్లో ఏదైనా సినిమా వేడుక అన్న లేదా ఏదైనా కార్యక్రమం అంటే తప్పనిసరిగా అక్కడ ఉదయభాను ఉండాల్సిందే. ఈమె కూడా యాంకర్ గాను అలాగే నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కొన్ని కారణాల వల్ల కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఉదయభాను తిరిగి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
ప్రస్తుతం బుల్లితెరపై పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈమె త్వరలోనే సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తుంది. అయితే ఈసారి ఈమె గ్లామర్ పాత్రలో కాకుండా విలన్ పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్న బార్బీరిక్ అనే సినిమా విలన్ పాత్రలో నటించబోతుందట.
ఈ సినిమా ఈమె కెరియర్ ను కీలక మలుపు తిప్పబోతుందని తెలుస్తుంది ఇక ఈ సినిమా కనుక మంచి సక్సెస్ అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతున్న అనసూయకు గట్టి పోటీ ఉంటుందని చెప్పాలి. మరి ఈ సినిమా ద్వారా ఉదయభాను కెరియర్ ఎలా ఉండబోతుందో తెలియాల్సి ఉంది.