బిగ్ బాస్ లో మరో ఇద్దరు కమెడియన్లు

తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో మొదట్లో బాగానే క్రేజ్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత మెల్లమెల్లగా డౌన్ అవుతూ వస్తోంది. నాగార్జున హోస్టింగ్ తో గత సీజన్స్ బాగానే హడావిడి చేశారు. అయితే 6వ సీజన్ మాత్రం మరింత దారుణంగా డిజాస్టర్ అయింది. అసలు నాగార్జున మళ్ళీ మరో సీజన్ కు హోస్టింగ్ చేస్తారా లేదా అని అనుమానాలు కూడా వచ్చాయి.

అయితే మళ్లీ నాగర్జున బౌన్స్ బ్యాక్ అయ్యే విధంగా రెడీ అవుతున్నాడు. ప్రస్తుతానికి ఆయన సినిమాలు కూడా సెట్స్ పైన ఏమీ లేవు. అందుకే బుల్లితెరపై ప్రేక్షకులకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ 7వ సీజన్ కు సంబంధించిన సెలబ్రిటీల లిస్ట్ కూడా ఈ మధ్య బాగానే వైరల్ అవుతుంది.

చాలామంది యాంకర్స్ పేర్లు అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టుల పేర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే 16 మందికి పైగా కంటెస్టెంట్స్ ను బిగ్ బాస్ యాజమాన్యం ఫైనల్ చేసినట్లుగా టాకా అయితే వినిపిస్తోంది. ఇక మరో ఇద్దరు జబర్దస్త్ కమెడియన్లు కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు గాసిప్స్ అయితే పుట్టుకొస్తున్నాయి.

అందులో పొట్టి నరేష్ తో పాటు రంగస్థలం ఫేమ్ మహేష్ పేరు కూడా వైరల్ అవుతొంది. ఇద్దరు కూడా ఇటీవల బిగ్ బాస్ షో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కథనాలు కూడా వెలువడుతున్నాయి. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి అలాగే ఆమె కూతురు సుప్రీత కూడా ఈసారి బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి కానీ ఇప్పటివరకు విషయంలో ఎవరు కూడా పెద్దగా క్లారిటీ ఇచ్చింది లేదు. మరి బిగ్ బాస్ ఏడవ సీజన్ లో ఎలాంటి సెలబ్రిటీలు అడుగు పెడతారో చూడాలి.