ఈ ఏడాది కోలీవుడ్ సినిమా దగ్గర ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన మోస్ట్ అవైటెడ్ రిలీజ్ ఏదన్నా ఉంది అంటే ఆ చిత్రం “లియో” అని చెప్పవచ్చు. హీరో విజయ్ నటించిన ఈ చిత్రాన్ని తమిళ నాట భారీ క్రేజ్ ఉన్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించారు.
మరి తన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైన సినిమా ఇది కావడంతో సెన్సేషనల్ హైప్ నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో భారీ ఓపెనింగ్స్ సాధించి అదరగొట్టింది. దీనితో “లియో” విజయ్ కెరీర్ లోనే ఒక రికార్డు బ్రేకింగ్ గ్రాసర్ గా అయితే నిలిచింది.
ఇక మొదటి వారం లోనే తమిళ నాట ఏ సినిమా కూడా అందుకొని భారీ వసూళ్లు అందుకోగా ఇప్పుడు ఫైనల్ గా ఓటిటి రిలీజ్ కి ఆల్రెడీ సిద్ధం ఐపోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే రీసెంట్ గానే తమిళ్ లో కంప్లీట్ ఒరిజినల్ ప్రింట్ సోషల్ మీడియాలో లీక్ అయిపోగా దీనితో సినిమా అతి త్వరలోనే ఓటిటికి వచ్చేస్తుంది అని ప్రచారం జరిగింది.
కాగా ఇప్పుడు అయితే అనుకున్న దానికంటే ముందే ఈ సినిమా వచ్చేస్తుంది అని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. దీనితో అయితే లియో కి మొదటగా ఈ నవంబర్ 16 ని లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ సినిమా హక్కులు నెట్ ఫ్లిక్స్ దగ్గర ఉండగా ఈ డేట్ తో పాటుగా 21 కూడా ఉందని వినిపిస్తుంది. దీనితో ఈ రెండు డేట్స్ లో అయితే లియో చిత్రం ఏదొక రోజున పాన్ ఇండియా భాషల్లో ఓటిటిలో రావచ్చని సినీ వర్గాలు చెప్తున్నాయి.