శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజెర్ మూవీ 2025 జనవరి 10 విడుదలవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ రోజుకి ఎలాగైనా సినిమా రిలీజ్ చేయాలని మూవీ టీం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా ఇప్పటికే చాలా లేట్ గా రిలీజ్ అవుతుందని అహసనం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే అదే రోజున తమిళ నటుడు అజిత్ హీరోగా నటించిన విదాముయార్చి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు ఆ మూవీ టీం.
తమిళంలో అజిత్ కి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. గేమ్ చేంజర్ విడుదలైన రోజే ఈ సినిమా కూడా విడుదలైనట్లయితే ఆ సినిమా ఓపెనింగ్స్ కి గట్టి దెబ్బ తగలక మానదు. గేమ్ చేంజర్ సినిమాలో కీలక పాత్ర పోషించిన తమిళ నటుడు, ప్రముఖ దర్శకుడు అయిన ఎస్ జె సూర్య ఈ విషయంపై స్పందించారు. తమ మధ్య ఎలాంటి పోటీ ఉండదు, ప్రేక్షకులు గేమ్ చేంజర్ చిత్రాన్ని కూడా ఆదరిస్తారు అని చెప్పారు.
విదాముయార్చి సినిమా కంటే ముందే మా సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాము, ఆ మేరకు వర్క్ చేస్తున్నాం కానీ వాళ్ళు సడన్గా తన సినిమా విడుదల తేదీని ప్రకటించారు. అజిత్ సినిమా విడుదలైనప్పుడు భారీ ఓపెనింగ్స్ ఉంటాయి కానీ మా సినిమాకి కూడా మంచి ఓపెనింగ్స్ ఉంటాయి. దానిని పోటీగా చూడవలసిన అవసరం లేదు అని చెప్పుకొచ్చారు. విదాముయార్చి సినిమాకి మాగీజ్ తిరుమేని డైరెక్షన్ చేస్తున్నారు లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించింది.
ఇందులో త్రిష కథానాయక కాగా అర్జున్, రెజీనా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక గేమ్ చేంజర్ విషయానికి వస్తే రామ్ చరణ్ హీరో కియారా అద్వానీ హీరోయిన్ కాగా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీకాంత్, సునీల్, ఎస్ జె సూర్య, అంజలి కీలకపాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. పై రెండు సినిమాలు జనవరి10 న విడుదల కావటం విశేషం. చూడాలి ఏ సినిమా పై చేయి సాధిస్తుందో.