ట్విట్టర్ రివ్యూ : సామ్ “శాకుంతలం” రిపోర్ట్స్ ఎలా ఉన్నాయ్?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ సమంత తన కెరీర్ లో చాలా గ్యాప్ మరియు దెబ్బలు తర్వాత “యశోద” అనేక సినిమా చేసి భారీ హిట్ కొట్టింది. 33 కోట్లకి పైగా గ్రాస్ ని ఈ సినిమా రాబట్టి తన స్టార్ పవర్ అయితే చూపించింది. ఇక ఈ సినిమా తర్వాత అయితే రిలీజ్ కి తెచ్చిన మరో పాన్ ఇండియా సినిమానే “శాకుంతలం”.

దర్శకుడు గుణశేఖర్ రిస్క్ తీసుకొని చేసిన మరో సినిమా ఇది. కాగా ఈ సినిమా అయితే మరీ అంత ఎక్కువ అంచనాలు మధ్య రాలేదు కానీ నార్మల్ గానే రిలీజ్ అయ్యింది. అయితే ఈ  ప్రీమియర్స్ పడిపోయాయి. మరి టాక్ అయితే ఏమంత గొప్పగా లేదని చెప్పాలి.

చాలా వరకు డిజాస్టర్ రివ్యూస్ వినిపిస్తున్నాయి. ఒక్క అభిమానులు నుంచి తప్ప మరెవ్వరి నుంచి కూడా ఈ సినిమాపై పాజిటివ్ రెస్పాన్స్ కనిపించడం లేదు. సినిమా చాలా స్లో గా బోరింగ్ గా ఉందని అంటున్నారు. అలాగే గ్రాఫిక్స్ కూడా సినిమాలో ఏమంత బాగోలేవని అంటున్నారు.

ఎదో బొమ్మలు సినిమాలు చూస్తున్నట్టుగా అలాగే సినిమాలో సెట్టింగ్స్ కూడా చాలా దారుణంగా ఉన్నాయని అనేస్తున్నారు. దీనితో అయితే శాకుంతలం సినిమా అనుకున్న అంచనాలు అందుకోలేదు అని చెప్పక తప్పదు. ఒక్క సమంత లుక్స్, పెర్ఫామెన్స్ తప్ప అసలు సినిమాలో విషయమే లేదు అంటున్నారు. దీనితో బాక్సాఫీస్ పరంగా దిల్ రాజుకి మరో ప్రయోగాత్మక ప్లాప్ గా ఇది నిలుస్తుంది అని చెప్పాలి.