ట్విట్టర్ రివ్యూ : “మేజర్” సినిమా అన్ని అంచనాలు రీచ్ అయ్యిందా??

ప్రస్తుతం వస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో మన తెలుగు నుంచే అనేక చిత్రాలు వస్తున్నాయి. అయితే వాటిలో అన్ని హిట్ అయ్యిపోతున్నాయని చెప్పడానికి లేదు కానీ దాదాపు హిట్ రేట్ అయితే మనకి ఉంది. మరి ఇదిలా ఉండగా ఇప్పుడు తెలుగు, హింది భాషల్లో ఒకేసారి తెరకెక్కి మలయాళం లో కూడా రిలీజ్ అయ్యున లేటెస్ట్ చిత్రమే “మేజర్ ది ఫిల్మ్”.

యంగ్ హీరో అడివి శేష్ నటించిన ఈ చిత్రం మంచి ప్రమోషన్స్ మరియు అంచనాలు మధ్య వచ్చింది. అయితే ఈ సినిమా ఆ అంచనాలు రీచ్ అయ్యిందా లేదా అనేది ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఈ సినిమాకి ప్రీమియర్స్ ఎప్పుడు నుంచో పడుతున్నాయి కానీ నిన్నటి వాటితో మాత్రం అధికారికంగా అందరికి రీచ్ అయ్యింది ఈ సినిమా.

మరి ఈ సినిమాపై అయితే ఆడియెన్స్ ఎక్కడా నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడం లేదు. సినిమా చాలా బాగుంది అనే టాక్ మాత్రమే వినిపిస్తుంది. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్రపై తీసి ఒక రియల్ హీరో మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన అతని లైఫ్ కోసం చూపించడం ఎంతో ఉద్వేగంగా ఉందని అంటున్నారు.

డైరెక్టర్ శశి అలాగే సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకల వర్క్ లు చాలా ప్లస్ అయ్యాయి అని అంటున్నారు. ఆడియెన్స్ తో పాటుగా సినిమా విమర్శకులు కూడా ఈ సినిమాని ప్రశంసిస్తున్నారు. అంటే ఈ లెక్కన ఈ సినిమా హిట్ జాబితాలో వెసెయ్యొచ్చని చెప్పాలి. ఫైనల్ గా అయితే మేజర్ సందీప్ కి ఈ సినిమా ఒక అద్భుతమైన నివాళి అని ముక్త కంఠంగా అంటున్నారు.