ట్విట్టర్ రివ్యూ : కమల్ “విక్రమ్” కి ఊహించని టాక్ మరియు రెస్పాన్స్ లు..!

Kamal Haasan Vikram Audio Launch

ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ హీరోలలో ఒకరైన కమల్ హాసన్ నుంచి ఎట్టకేలకు చాలా కాలం తర్వాత థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన చిత్రం “విక్రమ్”. కోలీవుడ్ టాలెంటెడ్ ఫిలిం మేకర్ లోకేష్ కనగ్ రాజ్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ హైప్ తో వచ్చింది. అయితే ఈ సినిమాపై ఇన్ని అంచనాలు నెలకొనడానికి కారణం…

 

ఈ సినిమాలో కమల్ తో పాటు ఫహద్ ఫాజిల్ విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి లాంటి నటులు కూడా సాలిడ్ రోల్స్ లో చేయడం వీటిని మించి ఇంకో ఇంట్రెస్టింగ్ అంశంగా స్టార్ హీరో సూర్య కూడా భాగం కావడంతో ఓ రేంజ్ లో హైప్ ఈ సినిమాపై నెలకొంది.

 

ఫైనల్ గా థియేటర్స్ లో పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన ఈ సినిమాకి పాజిటివ్ రిపోర్ట్స్ సోషల్ మీడియాలో స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా సినిమా చూసిన ప్రముఖ క్రిటిక్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ కనగ్ రాజ్ తన సినిమాటిక్ యూనివర్స్ తో అందరికీ ఒక సర్ప్రైజ్ ఇచ్చాడని.

 

అందరు నటులు అద్భుతంగా రాణించగా తన సినిమా “ఖైదీ” కి లింక్ చెయ్యడం కనిపించాయని అంటున్నారు. ఈ ఎక్స్ పీరియన్స్ లు చాలా కొత్తగా అనిపిస్తాయని సినిమా చూసిన వారు అంటున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఒక లెవెల్లో ఉందట. ఇంకో బిగ్ హైలైట్ ఏమిటంటే..

 

ఈ సినిమాకి ఇంకొ పార్ట్ కూడా ఉండడంతో ఆడియెన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు. మొత్తానికి అయితే ఈరోజు మంచి అంచనాలు పెట్టుకొని వచ్చిన ఈ సినిమాకి కూడా పాజిటివ్ టాక్ దక్కింది. ఇక వసూళ్లు పరంగా ఎలా ఉంటుందో చూడాలి.