ట్విట్టర్ రివ్యూ : ప్రీమియర్స్ తో “సార్” కి సూపర్ రివ్యూస్.?

తమిళ్ మరియు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరోస్ లో మల్టీ టాలెంటెడ్ హీరో అయినటువంటి ధనుష్ కూడా ఒకరు. మరి హీరోగా రచయితగా కూడా చేసిన తాను లేటెస్ట్  గా వర్క్ చేసిన సినిమానే “సార్”. తమిళ్ లో “వాథి” గా రిలీజ్ అయ్యిన ఈ సినిమా నిన్న రాత్రి 7, 8 నుంచే షో లు తెలుగు రాష్ట్రాల్లో పడ్డాయి.

అయితే అక్కడ నుంచి సినిమా చూసినవారు మాత్రం తన రివ్యూస్ ని ఆల్రెడీ ట్విట్టర్ వేదికగా అందిస్తున్నారు. అలా లేటెస్ట్ గా సినిమాపై పాజిటివ్ రివ్యూస్ వస్తుండడం విశేషం. తెలుగులో ప్రిన్స్, వారసుడు తర్వాత డైరెక్ట్ తెలుగు ఎంట్రీ ఇచ్చి ధనుష్ సినిమాగా హిట్ కొట్టాడని సినిమా తప్పక చూడాల్సిన సినిమా అంటున్నారు కొందరు.

అలాగే దర్శకుడు వెంకీ తీసుకున్న పాయింట్ చాలా బాగుంది అని మొదటి హాఫ్ సూపర్ గా ఉండగా రెండో హాఫ్ డీసెంట్ గా సాగింది అని తప్పకుండ చూడాల్సిన సినిమా అయితే ఇది అని చాలా మంది అంటున్నారు. అలాగే తెలుగు సహా తమిళ్ నాట కూడా ఇదే టాక్ కంటిన్యూ అవుతుంది.

అలాగే ధనుష్ తన నటనతో మరోసారి సినిమాలో హైలైట్ గా నిలిచాడని అంటున్నారు. అలాగే సినిమాలో గూజ్ బంప్స్ ఇచ్చే సీన్స్ కూడా చాలా ఉన్నాయని అంటున్నారు. దీనితో ఓవరాల్ గా మాత్రం సార్ తో సూపర్ హిట్ పడినట్టే అని చెప్పుకోవాలి.

కాగా ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా సితార ఎంటెర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ధనుష్ తెలుగులో డైరెక్ట్ హిట్ కొట్టగా ఇప్పుడు నిర్మాత మరియు దర్శకుడు తమ తొలి అడుగు తో తమిళ్ లో మంచి విజయం అందుకున్నారని చెప్పొచ్చు. 
https://twitter.com/Vaathiyaar_Offl/status/1626409466345447424


https://twitter.com/mvtamil_/status/1626416552483651586