టాలీవుడ్ లో ఈ దసరా కానుకగా వచ్చిన లేటెస్ట్ భారీ హిట్ చిత్రాల్లో అయితే నందమూరి నటసింహ టాలీవుడ్ మాస్ గాడ్ బాలయ్య నటించిన చిత్రం “భగవంత్ కేసరి” కూడా ఒకటి. మరి దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం బాలయ్య కెరీర్ లో మరో హిట్ గా నిలిచి మొత్తం హ్యాట్రిక్ గా నిలిచింది.
ఇక ఈ సినిమాకి ముందే అఖండ, వీరసింహా రెడ్డి లాంటి మాస్ హిట్స్ ఉండడంతో వాటితో పాటుగా ఇది మూడో హిట్ గా నిలిచింది. అయితే భగవంత్ కేసరికి బిజినెస్ గతంలో రెండు హిట్స్ ఉన్నప్పటికీ కూడా కేవలం డబ్భై కోట్ల మేర మాత్రమే జరిగింది అని ట్రేడ్ వర్గాల్లో టాక్ నడిచింది.
కానీ అసలు అది 70 కోట్లు కాదు 58 కోట్ల లోపే అని మేకర్స్ సైడ్ నుంచి అంటున్నారు. భగవంత్ కేసరికి జస్ట్ 57.6 కోట్ల బిజినెస్ జరిగితే 70 కోట్లకి పైగా షేర్ వచ్చింది అని అంటున్నారు. అంటే ఇక్కడ ఈ రకంగా బాలన్స్ చేసినట్టుగా అనిపిస్తుంది. అలాగే రెండు హిట్స్ కొట్టినప్పటికీ బాలయ్య బిజినెస్ స్టామినా పెరగక పోగా తగ్గినట్టుగా కూడా అని చెప్పాలి.
అయితే ఇవన్నీ జస్ట్ ప్రిస్టేజ్ కోసమే చెప్పుకుంటుంటున్న నంబర్స్ అని బాలయ్య ఫ్యాన్స్ హర్ట్ కాకుండా ఉండడానికే అని నిజానికి స్వల్పంగా నష్టాలు లేదా జస్ట్ అన్ని ఏరియాల్లో అనుకున్న టార్గెట్ ని అయితే ఈ చిత్రం రీచ్ అయినట్టుగా ట్రేడ్ సర్కిల్స్ చెప్తున్నాయి. సినిమా లాభాల్లోకి వెళ్ళింది అని చెప్పడానికి ఏకంగా సినిమా బిజినెస్ నే తగ్గించేసుకున్నారని కొందరు విమర్శలు చేస్తున్నారు.