నాని ‘దసరా’కి తిప్పలే తిప్పలు.!

నేచురల్ స్టార్ నాని నుంచి త్వరలో రాబోతోన్న ‘దసరా’ సినిమా గురించి రకరకాల రూమర్లు ప్రచారంలో వున్నాయి. ఈ సినిమాని రెండు ముక్కలు చేసి.. రెండు సినిమాలుగా విడుదల చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా ఓ ప్రచారం తెరపైకొచ్చిన సంగతి తెలిసిందే. ‘అంతా ఉత్తదే’ అని ఆ తర్వాత ఇంకో ‘క్లారిటీ’ లాంటి ప్రచారం షురూ అయ్యింది. ఆ విషయాన్ని పక్కన పెడితే, ‘దసరా’ విషయంలో నాని కొంత అయోమయంలో వున్నాడట.

నాని గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మరీ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. అలాగని నాని మార్కెట్ పడిపోయిందా.? అంటే, పడిపోయిందనీ చెప్పలేం. కాస్త డౌట్లు అయితే వున్నాయ్. అదే నాని ఆందోళన కూడా.

‘దసరా’ సినిమాని చాలా లార్జ్ స్కేల్‌లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ సినిమా.. అంటున్నారు. కానీ, నానిని చూస్తూ.. కొంత గందరగోళమే కనిపిస్తోంది. దాంతో, సినిమాకి హైప్ తెచ్చేందుకు ఎలా తిప్పలు పడాలా.? అని ఆలోచిస్తున్నాడట. నాని సినిమా అంటే.. నిర్మాత కంటే కూడా ఎక్కువగా హీరో నానినే ఛార్జ్ తీసుకుంటాడని తెలుసు కదా.!