“బ్రో” టీజర్..త్రివిక్రమ్ పై ట్రోల్స్.!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇపుడు చేస్తున్న చిత్రాల్లో సాయి ధరమ్ తేజ్ హీరోగా ప్రముఖ నటుడు సముద్రఖని తెరకెక్కిస్తున్న “బ్రో” కూడా ఒకటి. కాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతూ నిన్ననే ఈ సినిమా టీజర్ కూడా బయటకి వచ్చింది. కాగా ఈ టీజర్ కి ఇపుడు మాసివ్ రెస్పాన్స్ కూడా వస్తుంది.

పవన్ అలాగే సాయి ధరమ్ తేజ్ ల బ్రోమాన్స్ తో అయితే ఈ టీజర్ ఆడిపోగా సముద్రఖని పవన్ ని ప్రెజెంట్ చేసిన విధానం ఇప్పుడు హైలైట్ గా మారింది. మరి ఇదంతా బాగానే ఉంది కానీ మధ్యలో త్రివిక్రమ్ ని నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అలాగే స్క్రీన్ ప్లే ని అందిస్తున్నారు.

కాగా త్రివిక్రమ్ అలాగే హీరోయిన్ పూజా హెగ్డే విషయంలో ఉన్న ట్రోల్స్ కోసం అందరికీ తెలిసిందే. సరిగ్గా ఈ టీజర్ లేట్ అవ్వడం ఈ టీజర్ ఓపెనింగ్ లోనే పూజా హెగ్డే యాడ్ ఒకటి కనిపించడంతో అయితే ఇక అక్కడ నుంచి గురూజీ పై ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ టెక్నీకల్ గ్లిచ్ అదేనా ఈ యాడ్ పెట్టడం కోసమే త్రివిక్రమ్ టీజర్ ని ఆలస్యం చేసారని.

అసలు ఈ సినిమాకి పూజా హెగ్డే కి సంబంధం లేకపోయినా త్రివిక్రమ్ అక్కడ స్పేస్ లేదు కానీ కల్పింది పూజా ని యాడ్ చేసుకున్నారని అనేక ఫన్నీ ట్రోల్స్ కనిపిస్తున్నాయి. దీనితో త్రివిక్రమ్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్న ఏ అంశంలో అయినా కూడా పూజా పై చిన్న ఇన్సిడెంట్ వచ్చినా ఈ రకంగా వైరల్ అవుతుంది.