“దేవర” పై ట్రోల్స్.. ఎందుకిలా చేస్తున్నావ్ కొరటాలా.. 

ఈ ఏడాది రాబోతున్న భారీ చిత్రాల్లో ఆల్ మోస్ట్ మళ్ళీ టాలీవుడ్ సినిమా డెలివర్ చేయనున్న క్రేజీ చిత్రాలే చాలా ఉన్నాయి. కాగా ఈ చిత్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ సినిమానే “దేవర”. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా వస్తుండగా.. 

ఈ సినిమా నుంచి ఫాన్స్ కి కావాల్సిన టైం లో క్రేజీ అప్డేట్ లతో ట్రీట్ ని మేకర్స్ అందిస్తున్నారు. కాగా ఇవాళ కొత్త సంవత్సరం పురస్కరించుకొని మేకర్స్ ఎన్టీఆర్ పై ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అయితే దీనికి పాజిటివ్ రెస్పాన్స్ పక్కన పెడితే సోషల్ మీడియాలో ట్రోల్స్ మాత్రం ఎక్కువే కనిపిస్తున్నాయి.

మెయిన్ గా మెగాస్టార్ నటించిన చిత్రం “వాల్తేరు వీరయ్య” పోస్టర్స్ తో పోల్చి చాలా మంది చూపిస్తున్నారు. పడవ మీద చిరంజీవి పోస్టర్ కూడా వాల్తేరు వీరయ్య నుంచి ఉంటుంది. దీనితో దానిని కాపీ కొట్టినట్టుగా ఉందని కొందరు అంటున్నారు. ఇదేమి మొదటిసారి కాదు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినపుడు కూడా వాల్తేరు వీరయ్య పోస్టర్ లానే ఉందని అప్పుడూ ట్రోల్స్ వచ్చాయి. దీనితో కొరటాల మాత్రం మళ్ళీ దెబ్బేసాడని కొందరు అంటున్నారు.

ఇక ఇవి మాత్రమే కాకుండా ఈ మధ్య సినిమా నిర్మాత ఎన్టీఆర్ కి అన్న అయినటువంటి కళ్యాణ్ రామ్ దేవర చిత్రాన్ని “గేమ్ ఆఫ్ థ్రోన్స్” తో పోల్చి చెప్పాడు ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా నిజంగానే ఆ సిరీస్ పోస్టర్ లానే కాపీ కొట్టేశారని కొన్ని ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. మొత్తానికి అయితే కొరటాల మాత్రం దేవర తో కొత్తగా ఏమి చూపించట్లేదు అనే మాట ఎక్కువయింది. ఇక ఈ 8న వచ్చే గ్లింప్స్ అయినా అంచనాలు అందుకుంటుందో లేదో చూడాలి మరి.