గూగుల్‌లో కూడా కనిపించడం లేదు!!.. బిగ్‌బాస్ కంటెస్టెంట్లపై ట్రోల్స్, మీమ్స్ హల్చల్

trolls on bigg boss 4 telugu contestants list

బిగ్‌బాస్ నాల్గో సీజన్‌పై అందరూ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం నెలకొన్ని ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఎవ్వరూ బయటకు వెళ్లే దారులు లేవు. ఎంచక్కా ఇంటి పట్టునే ఉంటే బిగ్‌బాస్ వినోదాన్ని అందిస్తాడని అంతా ఆశపడ్డారు. అందుకే ఈసారి కంటెస్టెంట్లు కూడా అదిరిపోయి ఉంటారని అంతా భావించారు. కానీ ఒక్కో కంటెస్టెంట్ ఎంట్రీ ఇస్తూ ఉంటే వారెవ్వరో కనిపెట్టలేక కొందరు క్విజ్ పోటీల నుంచి తప్పుకున్నంత పనైంది.

trolls on bigg boss 4 telugu contestants list
trolls on bigg boss 4 telugu contestants list

సరే వచ్చిన కంటెస్టెంట్లు వారి పేరు చెప్పుకుని, పరిచయం చేసుకున్నా సరే వారిలో కొందరినీ గుర్తుపట్టలేకపోయారు ప్రేక్షకులు. అంత గొప్ప కంటెస్టెంట్లను ఏరి మరి తెచ్చాడు బిగ్‌బాస్. మొదలైన ఫస్ట్ రోజే బిగ్‌బాస్, హోస్ట్ నాగార్జనను, కంటెస్టెంట్లను నెటిజన్లు ఏకిపారేశారు. వీరంతా ఎక్కడోళ్లురా బాబు అంటూ తలలు పట్టుకున్నారు. ఓ ఇద్దరు ముగ్గురు తప్పా అంతా స్క్రాప్ అంటూ మీమ్స్‌తో రచ్చ చేస్తున్నారు.

trolls on bigg boss 4 telugu contestants list
trolls on bigg boss 4 telugu contestants list

తెలుగు తెరపై అడపాదడపా చిత్రాలు చేసిన మోనాల్ గజ్జర్‌ను పేరు చెప్పుకున్నా కూడా కొందరు గుర్తు పట్టలేదు. ఇక సూర్యకిరణ్ పరిస్థితి మరీ ఘోరం. ఎంతో గొప్పగా డైలాగ్‌లు రాసుకుని, చదరంగం కాన్సెప్ట్‌తో ఓ ప్రోమో డిజైన్ చేయించుకున్నాడు. ఇంతా చేసి చివర్లో పేరు చెప్పుకున్నా కూడా ఎవరో పసిగట్ట లేకపోయారు. సత్యం సినిమా డైరెక్టర్ అంటే గానీ ఎవ్వరి మదిలోకి రాలేకపోయాడు. ఇక తెలుగు బుల్లితెర ప్రేక్షకులు సుపరిచితురాలైన లాస్య ఓ మోస్తరుగా ఓకే అనిపించింది.

trolls on bigg boss 4 telugu contestants list
trolls on bigg boss 4 telugu contestants list

అప్పుడెప్పుడో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ అనే చిత్రంలో హీరోగా నటించిన అభిజీత్ పరిస్థితి మరీ దారుణం. తాను చేసిన ప్రాజెక్ట్‌లన్నీ చెబితే గానీ ఓ పట్టాన గుర్తు పట్టలేకపోయారు. పెళ్లి గోల వెబ్ సిరీస్ అని చెప్పాక కొంత మందికి స్ట్రైక్ అయింది. తెలంగాణ వార్తలను జోర్దార్‌గా చెప్పే సుజాత ఓ సెక్షన్ జనాలకు బాగానే తెలుసు. ఇక టీవీ9 యాంకర్ దేవీ నాగవల్లి ఇక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక యూట్యూబ్‌లో తెలంగాణ యాసతో ఫేమస్ అయిన దేత్తడి హారిక.. తన పేరును చెప్పుకునే వరకు కూడా ఎవ్వరూ గుర్తు పట్టలేకపోయారు. ఎందుకంటే ఆమె అలాంటి వస్త్రాధారణతో ఎంట్రీ ఇచ్చింది మరి.

trolls on bigg boss 4 telugu contestants list
trolls on bigg boss 4 telugu contestants list

సయ్యద్ సోహెల్.. ఈ కంటెస్టెంట్ మాత్రం మరీ దారుణం. పేరు చెప్పుకున్నా సరే గుర్తుకు రాలేకపోయాడు. కృష్ణవేణి సీరియల్ పేరు చెప్పగానే ఓ మోస్తరుగా లైటు వెలిగింది కొందరికి. యూట్యూబ్‌లో సెలెబ్రిటీలను ఇంటర్వ్యూలను చేస్తూ కాంట్రవర్సీలు, ఎక్స్‌పోజింగ్‌తో హల్చల్ చేసే యాంకర్ ఆరియానా గ్లోరీ ప్రోమోలో బిల్డప్ బాగానే ఇచ్చింది. కానీ ఎవ్వరూ గుర్తుపట్టలేకపోయారు. కొరియోగ్రఫర్, డైరెక్టర్ అమ్మ రాజశేఖర్, కరాటే కళ్యాణి, నోయల్ కాస్త పరిచయం ఉన్న పేర్లు. దివి, అఖిల్ సార్థక్ అనే ఓ ఇద్దరు కంటెస్టెంట్‌లు వచ్చారు. పాపం గూగుల్‌లో కూడా వీరిద్దరు కనబడం లేదని సెటైర్లు వేస్తున్నారు. ఈ సీజన్ మొత్తంలో ఎంట్రీతో విజిల్స్ వేయించిన కంటెస్టెంట్ గంగవ్వ మాత్రమే. ఈమె ఒక్కదానికే కాసింత పాజిటివిటీ వచ్చింది. చూద్దాం మరి వీరంతా ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తారో.