త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల మనిషి కాదు చేతల మనిషి అని పలు సందర్భాలలో ప్రముఖులే అభిప్రాయపడ్డారు. మాటలనే తూటాలుగా .. సంచుల కొద్ది పంచులను విసురుతూ హీరో ఎవరైన తన మార్క్ మాటలతో మాయ చేస్తూ మాటల మాంత్రీకుడు అనిపించుకున్నాడు. త్రివిక్రమ్ సినిమాలలో అన్నీ ఎమోషన్స్ ఉంటాయి. హీరో.. హీరోయిన్ పాత్రలే కాదు కథలో ఉన్న మిగతా పాత్రలు చాలా బలంగా ఉంటాయి. త్రివిక్రమ్ సినిమాలో చిన్న పాత్ర చేసిన నటుడు కూడా ప్రేక్షకుల మనుసులో బలంగా నాటుకుపోతాడు.
ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమా అంతా కూడా ఒక ఎమోషనల్ జర్నీగా సాగుతుంది. సినిమా ఫ్లాప్ అయినా ఎంజాయ్ చేయని ప్రేక్షకుడు ఉండడు. బిగ్ స్క్రీన్ మీద ఫ్లాప్ సినిమా కూడా బుల్లితెర మీద రికార్డులు క్రియేట్ చేసింది. అలాంటి త్రివిక్రమ్ పబ్లిక్ ఫంక్షన్స్ లో అలా చిరు నవ్వు చిందిస్తూ కూర్చుంటాడు తప్ప పెద్ద పెద్ద లెక్చర్లు ఇవ్వడు. కాని ఎప్పుడైతే ఎమోషనల్ అవుతాడో ఆ రోజు సినిమా చూపిస్తాడు. 2020 దాదాపు సినిమా ఇండస్ట్రీకి బ్యాడ్ చేసింది. కాని త్రివిక్రమ్ కి మాత్రం అదే 2020 జీవితాంతం గుర్తుండిపొయే బహుమతి ని ఇచ్చింది.
అదే అల వైకుంఠపురములో సినిమా. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – పూజా హెగ్డే జంటగా నటించిన ఈ సినిమాని త్రివిక్రమ్ తెరకెక్కించగా గత ఏడాది సంక్రాంతి పండుగకి రిలీజై ఇండస్ట్రీ హిట్ ని సాధించింది. కాగా ఆల్బం పరంగా కూడా ఇప్పటికీ రికార్డ్స్ క్రియేట్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా రిలీజై సంవత్సరం అయిన సందర్భంగా గ్రాండ్ ఈవెంట్ ని నిర్వహించారు చిత్ర యూనిట్. ఈ ఈవెంట్ లో త్రివిక్రమ్ చాలా ఎమొషనల్ అయ్యారు. సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి రిలీజైయ్యే వరకు జరిగిన పలు సంఘటనలు.. ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకొని దాదాపు ఏడ్చినంత పని చేశారు. మొత్తంగా ” అల .. ” జర్నీ ఒక అద్భుతం అని తెలిపారు.