Trivikram- Mahesh: ఆమె వల్ల  త్రివిక్రమ్ తో  మహేష్ కి గొడవ ! 

Trivikram- Mahesh:  సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి  వచ్చే ఛాన్స్ లు వెనుక చాలా వ్యవహారాలు ఉంటాయి. స్టార్ హీరో అయితే, అతగాడి రికమెండేషన్లు ఉంటాయి,  ప్రముఖ నిర్మాత ఐతే, ఆయనగారి ఆబ్లికేషన్లూ ఉంటాయి. అయితే, దర్శకుడు త్రివిక్రమ్ విషయంలో మాత్రం ఆయన చెప్పిందే ఫైనల్.  ప్రస్తుతం  త్రివిక్రమ్ – మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. నిజానికి పూజా హెగ్డే కి  ఛాన్స్ రావడం వెనుక త్రివిక్రమే  ఉన్నాడు. ఇప్పటికే పూజాతో వరుసగా రెండు సినిమాలు చేశాడు. మూడో సినిమాకి కూడా ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నాడు. హారిక హాసిని అధినేత చిన్నబాబు లాంటి  కొందరు ఈ విషయంలో ససేమిరా వద్దు అని చెప్పినా,  త్రివిక్రమ్ వినే పరిస్థితిలో లేడు.

అసలు మహేష్  ఈ సినిమాకు సంబంధించి  బాలీవుడ్ హీరోయిన్ని రికమెండ్ చేశాడు. ఎలాగూ వచ్చే ఏడాది  రాజమౌళితో  పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.  సో.. ఈ సినిమా దగ్గర నుంచే తనకు పాన్ ఇండియా ఇమేజ్ ను పెంచుకునే ఆలోచనలో  మహేష్ బాబు ఉన్నాడు. అందుకే, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణె ను ఫైనల్ చేయాలనుకున్నాడు. కానీ.. ఈ లోపే త్రివిక్రమ్ కావాలని  తన రెగ్యులర్ హీరోయిన్ పూజా హెగ్డే పేరును ఎనౌన్స్ చేశాడు. ఇది అస్సలు ఇష్టం లేని మహేష్.. త్రివిక్రమ్ పై మండి పడుతున్నాడు.

మీకు ఆమెకు మధ్య ఏమైనా ఉండొచ్చు.  అంతమాత్రాన  ఈ ప్రాజెక్ట్ లోకి  తీసుకుంటారా ?,  పూజా హెగ్డేను ఈ సినిమాలోకి తీసుకుంది, పాత్ర డిమాండ్ మేరకు కాదు కదా !’ అంటూ  మహేష్ బాబు లాజిక్స్ మాట్లాడుతున్నాడు. కానీ.. త్రివిక్రమ్ మాత్రం పూజా హెగ్డేను ఓకే చేసేశాం అండి,  ఈ సారికి పూజా హెగ్డేతోనే  ముందుకు పోదాం అంటూ  మహేష్ కి సర్ది చెబుతున్నాడు.  మొత్తానికి  ఈ తతంగంలోకి మహేష్ కి  –  త్రివిక్రమ్ కి  మధ్య చిన్నపాటి గొడవ కూడా అయింది.  మొత్తానికి  మహేష్, త్రివిక్రమ్ పై  బాగా అసంతృప్తిగా ఉన్నాడు. మరి ఈ అసంతృప్తిని,  కోపాన్ని  త్రివిక్రమ్  ఎలా పోగొడతాడో.. !  ఎలాగూ స్టార్  హీరోలను బుట్టలో వేసుకోవడంలో  త్రివిక్రమ్ మాస్టర్ డిగ్రీ చేశాడు కదా.