గాసిప్స్ – పూజా హెగ్డేకి న్యాయం చెయ్యబోతున్న త్రివిక్రమ్.?

ప్రస్తుతం టాలీవుడ్ లో తన డిమాండ్ ని పోగొట్టుకుంటున్న హీరోయిన్స్ లిస్ట్ లో అయితే డస్కీ బ్యూటీ పూజా హెగ్డే కూడా ఒకామె కాగా పూజా హెగ్డే కెరీర్ లో ఇప్పుడు ఊహించని మలుపులు తీసుకుంటుండడంతో ఆమె లైనప్ పై అయితే అంతకంతకు సస్పెన్స్ కొనసాగుతుంది.

తెలుగు తమిళ్ సహా హిందీలో కూడా ఏ భాషలో ఆమె సినిమా చేసినా ఇపుడు అది బాక్సాఫీస్ దగ్గర విజయం అందుకున్న పరిస్థితి లేదు. ఒకప్పుడు తెలుగు సినిమాని రూల్ చేసిన పూజా హెగ్డే ఇప్పుడు ఆఫర్స్ కి కరువయిపోయింది. అయితే ఆమెకి ఆఫర్స్ ఇవ్వడంలో మాత్రం దర్శకుడు త్రివిక్రమ్ ఎప్పుడూ ముందుంటున్నాడు.

ఎందుకు ఈమెని త్రివిక్రమ్ అంతలా ఎంకరేజ్ చేస్తున్నాడా అని ఫ్యాన్స్ జుట్టు పీక్కుంటున్నారు కానీ గురూజీ మాత్రం పూజా ని వదలడం లేదు. అయితే ఇప్పుడు మహేష్ బాబు తో చేస్తున్న గుంటూరు కారం సినిమాకి ఎలాగో పూజాని పక్కన పెట్టేసారు. దీనితో ఫ్యాన్స్ చాలా మంది హమ్మయ్య అనుకున్నప్పటికీ మళ్ళీ పూజా హెగ్డే పేరు ఈ సినిమా కోసం వినిపిస్తూ ఉండడం వైరల్ గా మారింది.

కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ ని పూజా పోగొట్టుకున్నప్పటికీ ఈ సినిమాలో ఐటెం భామగా అయితే కనిపిస్తుంది అని ఈ ఒక్క అంశాన్ని త్రివిక్రమ్ ప్రమేయం తీసుకొని యాడ్ చేసారని సినీ వర్గాల్లో గాసిప్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. దీనితో ఈరకంగా పూజాకి త్రివిక్రమ్ న్యాయం చేస్తున్నాడని కొందరు సెటైర్స్ వేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అనేది వేచి చూడాలి.