గుణశేఖర్ సినిమాని లాక్కుంటున్న త్రివిక్రమ్

టాలీవుడ్ లో గుణశేఖర్ అంటే ఒక టాప్ టెక్నీషియన్ అనే పేరు ఉంది. కానీ, ఆయన సినిమాలు బడ్జెట్ కంట్రోల్ లో ఉండవు, పైగా సక్సెస్ రేట్ కూడా అంతంత మాత్రమే. ఎప్పుడో మహేష్ బాబు తో తీసిన ‘ఒక్కడు’ సినిమా తర్వాత గుణశేఖర్ కి ఒక్క హిట్ కూడా లేదు.

ఎంతో భారీ బడ్జెట్ తో తీసిన ‘రుద్రమదేవి’ సినిమా ప్లాప్ అయ్యింది. అప్పటి నుండి ఇప్పటివరకు గుణశేఖర్ నుండి సినిమా రాలేదు. కొన్నాళ్ల క్రితం సమంత తో ‘శాకుంతలం’ అనే సినిమా పూర్తి చేసాడు, కానీ ఆ సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు.

కొన్ని సంవత్సరాల క్రితం గుణశేఖర్ రానా తో ‘హిరణ్య కశ్యప ‘ అనే సినిమా ప్రకటించాడు. ఈ సినిమాని ప్రొడ్యూస్ చెయ్యడానికి ‘దిల్’ రాజు కూడా ముందుకు వచ్చాడు, కానీ ఆ తర్వాత ఈ సినిమా గురించి ఎలాంటి న్యూస్ రాలేదు.

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రానా తో త్రివిక్రమ్ సినిమా ఉండబోతుందని.అది కూడా హిరణ్య కశ్యప అనే కాన్సెప్ట్ తో ఉంటుంది అంటూ ప్రచారం జరుగుతోంది.

త్రివిక్రమ్ పౌరాణిక చారిత్రాత్మక నేపథ్యం లో సినిమా లు ఇప్పటి తీయలేదు. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ ఆ సబ్జెక్టుని అనుకుంటుండడంతో అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు తో సినిమా చేస్తున్న త్రివిక్రమ్, ఆ సినిమా పూర్తయ్యాక రానా తో ఒక సినిమా, అల్లు అర్జున్ తో ఇంకో సినిమా చేయనున్నాడు.