మహేష్ బాబుతో పోటీ పడటానికి కోబ్రా విలన్ ను రంగంలోకి దింపుతున్న త్రివిక్రమ్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా విజయం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకుంటుంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అన్ని పనులు కూడా పూర్తి అయ్యాయని, త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో మహేష్ బాబుతో పోటీ పడటానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మలయాళ నటుడు రోషన్ మాథ్యూను రంగంలోకి దింపబోతున్నట్టు తెలుస్తోంది.
మాలీవుడ్ నటుడిగా రోషన్ మాథ్యూకు సౌత్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉంది. ఈ క్రమంలోనే మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ సినిమాలో విలన్ పాత్రలో ఈయనని తీసుకోవడం కోసం త్రివిక్రమ్ అన్ని ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. విక్రమ్ నటించిన కోబ్రా సినిమాలో తన విశ్వరూపం చూపించారు.

ఇలా విక్రమ్ కోబ్రా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన నాని హీరోగా నటిస్తున్నటువంటి దసరా సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం మహేష్ బాబు సినిమాలో ఈయనని విలన్ పాత్ర కోసం తీసుకోవాలని ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారక ప్రకటన వెలబడునున్నట్లు సమాచారం.