భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన త్రిష.. ఏకంగా అన్ని కోట్లా?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తెలుగులో కూడా అగ్ర హీరోలు అందరి సరసన నటించిన ఒకానొక సమయంలో అగ్రతారక పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా తెలుగుతోపాటు తమిళ సినిమాలలో కూడా వరుస అవకాశాలను అందుకొని ఒకానొక సమయంలో ఇండస్ట్రీని ఏలిన త్రిషకు గత కొంతకాలంగా సరైన హిట్టు పడలేదని చెప్పాలి.ఈ క్రమంలోనే మణిరత్నం దర్శకత్వంలో తాజాగా ఈమె నటించిన పొన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇకపోతే ఈ సినిమా పలు భాషలలో పెద్దగా సక్సెస్ సాధించలేకపోయిన తమిళంలో మాత్రం ఎన్నో సినిమాల రికార్డులను చెరిపివేసింది.ఇలా తమిళంలో బ్లాక్ బస్టర్ కావడంతో త్రిషకు తిరిగి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరోలైన అజిత్, విజయ్ వంటి హీరోల సరసన ఈమెకు అవకాశాలు వస్తున్నాయి. అయితే ఈమె సినిమాల కోసం తీసుకునే రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.