దీపిక పదుకొణె పాత్రలో ఛాలెంజింగ్ రోల్ చేయబోతున్న త్రిష ..!

కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా 96 తో మళ్ళీ ఫాం లోకి వచ్చిన త్రిష చాలా సెలెక్టెడ్ గా సినిమాలని ఎంచుకుంటోంది. ఇప్పటికే మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొన్నియన్ సెల్వం లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా మీద త్రిష భారీ అంచనాలు పెట్టుకుంది. కాగా ఈ సినిమా భారీ తారాగణంతో పాన్ ఇండియన్ సినిమాగా రూపొందుతోంది. కాగా తాజా సమాచారం ప్రకారం త్రిష మరో సినిమా కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది.

Ranveer Singh: Piku is Deepika Padukone's career best | India.com

బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ – దీపిక పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన పీకు సూపర్ హిట్ ని సాధించింది. కాగా ఈ సినిమా కోలీవుడ్ లో రీమేక్ చేయబోతుండగా హిందీలో దీపిక పదికొణె పోషించిన పాత్రలో త్రిష నటించబోతుంది. అంతేకాదు ఈ సినిమాని తెలుగు, తమిళంలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఇక బాలీవుడ్ లో ముఖ్యంగా అమితాబ్, దీపిక పోషించిన పాత్రలకి విమర్శకుల నుంచి కూడా గొప్ప ప్రశంసలు దక్కాయి.

అయితే ఇప్పుడు అమితాబ్ పాత్రలో ఎవరు నటిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక త్రిష కి మాత్రం ఈ క్యారెక్టర్ ఛాలెంజ్ తో కూడుకున్నది. త్రిష అద్భుతమైన నటి. అందులో సందేహం లేదు. కాని అమితాబ్ లాంటి మరొక పాత్రతో కలిసి ఎలా నటిస్తుందన్నదే ఇప్పుడు ఆసక్తికరమైన చర్చలకి కారణం అయింది. ఇక ఈ సినిమా 2021 ప్రథమార్ధంలో సెట్స్ మీదకి వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. అంతేకాదు అన్నీ అనుకున్నట్టు గనక జరిగితే వచ్చే ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట.