ట్రైలర్ టాక్ : ఊహించని లెవెల్లో “సైంధవ్” గా వెంకీ మామ బ్లాస్ట్ 

ఇపుడు సినిమాలో కూడా మారిన జెనరేషన్ తో అయితే ఆడియెన్స్ అభిరుచులు కూడా మారాయి. దీనితో సీనియర్ హీరోస్ కూడా తమ పంథా మార్చి చేస్తున్న సినిమాలు చూస్తే ఆడియెన్స్ కి మరింత థ్రిల్ ని అందిస్తున్నాయి. కాగా అలా తమిళ్ ఉలగనయగన్ కమల్ హాసన్ అలాగే రజినీకాంత్ లు తమ ఏజ్ కి తగ్గ పాత్రలు చేసిన చిత్రాలు “విక్రమ్”, “జైలర్” సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయి అనేది బాగా తెలుసు.

దీనితో తెలుగు ఆడియెన్స్ కూడా ఈ రకమైన సినిమాలు మన సీనియర్ స్టార్స్ నుంచి కోరుకుంటూ ఉండగా వారిలో వెంకీ మామ వెంకటేష్ స్టార్ట్ చేసిన సినిమా మంచి అటెన్షన్ ని తెచ్చుకుంది. కాగా ఆ చిత్రమే “సైంధవ్”. అప్పటికే రెండు “హిట్” సినిమాలు అందించిన టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలనుతో అనౌన్స్ చేసిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేశారు.

ఇక ఫైనల్ గా రిలీజ్ దగ్గరకి వస్తుండడంతో ట్రైలర్ ని ఇపుడు రిలీజ్ చేయగా ఈ ట్రైలర్ ఊహించని లెవెల్లో ఉంది. చాలా కాలం తర్వాత రెగ్యులర్ కి బ్రేక్ ఇచ్చి వెంకీ మామ చేసిన ఈ సినిమా కంప్లీట్ ఫుల్ మీల్స్ పెట్టేలా ఉందని చెప్పాలి. తన కూతురును కాపాడుకునే తండ్రిగా తాను ఎంతవరకు తెగిస్తాడు అనేది మెయిన్ పాయింట్ గా ఇందులో కనిపిస్తుంది.

ఇక వెంకీ తో పాటుగా బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిక్కీ తన నటనతో స్టన్ చేసాడు. ఇంకా ఇందులో ఎమోషన్స్ సహా మాస్ ఎలిమెంట్స్ ఇంకా సినిమా ఏక్షన్ బ్లాక్ లు కూడా మైండ్ బ్లోయింగ్ గా కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ సంక్రాంతి బరిలో పక్కా హిట్ సినిమాతో మేకర్స్ దిగుతున్నారా అని ఈ ట్రైలర్ చూసాక అనిపిస్తుంది. 
Saindhav Trailer - Telugu | Venkatesh Daggubati | Sailesh Kolanu | Niharika Entertainment |