ట్రైలర్ టాక్ : “దసరా” తో నాని అండ్ టీం భీభత్సం.!

ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర గట్టి హోప్స్ తో అంతకు మించిన హైప్ తో వస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది మన టాలీవుడ్ సినిమా నుంచి రాబోతున్న “దసరా” అనే చెప్పాలి. సినిమా మొదలు పెట్టిన నాటి నుంచి నాచురల్ స్టార్ మరియు హీరోయిన్ కీర్తి సురేష్ లను ఊహించని లెవెల్లో ప్రెజెంట్ చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కోసం అనేక మంది మాట్లాడుకున్నారు.

కాగా ఇక అంతా ఎంతో కాలం నుంచి ఆసక్తి గా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ మాస్ ట్రైలర్ కట్ అయితే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ భాషల్లో రిలీజ్ అయ్యింది. ఇక ఈ ట్రైలర్ చూస్తే సినిమా ఒక పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా నిలవడం కన్పిస్తుంది. అయితే నాని అలాగే కీర్తి సురేష్ లు డీ గ్లామర్ తో కనిపించి వారి రోల్స్ లో ఒదిగిపోయారు.

నాని మాస్ షేడ్ మరియు ఎమోషన్స్ నెక్స్ట్ లెవెల్లో బెస్ట్ గా ఉన్నాయి. ఇక మేము ఇది వరకే చెప్పిన ట్రైన్ ట్రాక్ ఏక్షన్ సీన్ ఈ ట్రైలర్ లో హైలైట్ గా కనిపించింది. అయితే మూవీ లవర్స్ కి ఈ ట్రైలర్ ఇంకా బాగా నచ్చే అంశం ఏదన్నా ఉంది అంటే సినిమాలో కనిపించే అందరి నటులను సరికొత్త గా చూడడం అని చెప్పాలి.

ఉదాహరణకు సముద్రకని షాకింగ్ లుక్ లో ఈ సినిమాలో కనిపించారు అలాగే విలన్ పాత్రదారుడు కూడా సినిమా నేటివిటి కి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయారు. వీరు నిజంగా ఈ ట్రైలర్ లో బిగ్గెస్ట్ ఎసెట్ కాగా ఇక సినిమా సంగీతం సంతోష్ నారాయణన్ ఇచ్చి పడేసాడు.

ఓవరాల్ గా ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచే విధంగానే నాటు భీభత్సం తో ఉంది తప్ప తగ్గించేలా లేదనే చెప్పుకోవాలి. మరి వరల్డ్ వైడ్ గా ఈ మార్చ్ 30 న రానున్న ఈ సినిమా ఎలా ఉండబోతోందని చూడాల్సిందే.
Dasara Trailer | Nani | Keerthy Suresh | Santhosh  Narayanan | Srikanth Odela | SLV Cinemas