ఇండస్ట్రీ టాక్ : “ఆనిమల్” బ్యూటీకి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆఫర్..?

ప్రస్తుతం బాలీవుడ్ మార్కెట్ దగ్గ దుమ్ము లేపుతున్న సరికొత్త భారీ ప్రాజెక్ట్ “ఆనిమల్” కోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించగా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా అయితే నటించింది. మరి ఈ చిత్రంలో వీరితో పాటుగా మరో హైలైట్ అయ్యింది.

బాలీవుడ్ యంగ్ బ్యూటీ త్రిప్తి దిమిరి కూడా అని చెప్పాలి. ఆమె చేసిన పాత్రకి ఆడియెన్స్ లో క్రేజీ రెస్పాన్స్ రాగా ఆమెకి ఈ సినిమా దెబ్బతో భారీ ఆఫర్లు వచ్చాయని టాక్ స్టార్ట్ అయ్యింది. మెయిన్ గా తెలుగు నిర్మాతలు ఆమెని తమ హీరోయిన్ గా చేయాలని గట్టిగానే ట్రై చేస్తున్నారనీ టాక్ వచ్చింది.

అయితే ఈమె ఆల్రెడీ టాలీవుడ్ స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి హీరో రవితేజ కాంబినేషన్ లో సినిమాకి లాక్ అయ్యింది అని గాసిప్స్ మొదలయ్యాయి. మరి ఈ టాక్ లో ఎంతవరకు నిజం ఉంది అనేది పక్కన పెడితే అసలు ఈ కాంబినేషన్ నే వద్దు అని మూవీ లవర్స్ అనుకుంటున్నారు.

అనిల్ రావిపూడి సినిమాలు కోసం తెలిసిందే, ఎక్కడ ఆమెని క్రింజ్ కామెడీ రోల్స్ లో చూపిస్తాడో అని చాలా మంది భయపడుతున్నారు. అయితే ప్రస్తుతానికి ఈ కాంబినేషన్ వార్తల్లో ఎలాంటి నిజం లేదని సినీ వర్గాలు చెప్తున్నాయి. కేవలం రూమర్స్ మాత్రమే అని ఎవరో స్ప్రెడ్ చేసింది తప్ప అందులో ఎలాంటి నిజం లేదని చెప్పాలి. కాగా ఇప్పుడు రవితేజ నటిస్తున్న భారీ సినిమా “ఈగిల్” రిలీజ్ తో సిద్ధంగా ఉన్నాడు.