ఘనంగా అలీ కుమార్తె వివాహం.. హాజరైన సినీ రాజకీయ ప్రముఖులు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటుడు అలీ ఇంట ఘనంగా వివాహ వేడుకలు జరిగాయి.కమెడియన్ అలీ పెద్ద కుమార్తె ఫాతిమా వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. గత రెండు నెలల క్రితం నిశ్చితార్థాన్ని ఎంతో ఘనంగా జరిపించిన ఆలీ అనంతరం తన కుమార్తె వివాహాన్ని నిన్న హైదరాబాద్లో ఘనంగా జరిపించారు. ఇక ఈమె పెళ్లి వేడుకలు ప్రారంభం అయినప్పటి నుంచి తన పెళ్లి వేడుకలకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

ఇకపోతే ఆలీ దంపతులు ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులను కూడా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన కుమార్తె వివాహానికి ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఏపీ మినిస్టర్ రోజాతో పాటు మెగాస్టార్ చిరంజీవి దంపతులు అలాగే నాగార్జున దంపతులు కూడా హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఇక పెళ్లి వేడుకలలో పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు కూడా సందడి చేశారు.ఇక ఆలీ వైసీపీ పార్టీకి మద్దతు తెలపడంతో ఏపీ ప్రభుత్వం ఈయనకు ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా పదవి అప్పజెప్పిన సంగతి తెలిసిందే. రాజకీయ ప్రముఖులు కూడా అలీ కుమార్తె వివాహానికి హాజరయ్యారు.ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.