Home Entertainment బ్రేకింగ్ : మెగాస్టార్ చిరంజీవికి కరోనా... షాక్ లో అభిమానులు

బ్రేకింగ్ : మెగాస్టార్ చిరంజీవికి కరోనా… షాక్ లో అభిమానులు

ఈ మాయదారి కరోనా ఇంకా మనల్ని వదిలేట్టు లేదు. ఇప్పటికే ప్రపంచమంతా ఈ కరోనా వల్ల అస్తవ్యస్తం అయింది. ఇఫ్పుడిప్పుడే జనాలు కరోనా భయం నుంచి బయటికి వస్తున్న క్రమంలో మరోసారి టాలీవుడ్ లో కరోనా కలకలం సృష్టించింది.

Tollywood Megastar Chiranjeevi Tests Corona Positive
tollywood megastar chiranjeevi tests corona positive

తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకింది. ఈ విషయాన్ని మెగాస్టారే తన ట్విట్టర్ లో వెల్లడించారు. త్వరలోనే చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన కరోనా టెస్ట్ చేయించుకున్నారట. దీంతో ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలిందట.

నాకు కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ ఎటువంటి లక్షణాలు అయితే లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజుల నుంచి నన్ను కలిసిన వారందరూ దయచేసి కరోనా టెస్ట్ చేయించుకోండి. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియజేస్తాను.. అని చిరంజీవి ట్వీట్ చేశారు.

అయితే.. ఇటీవలే చిరంజీవి.. నాగార్జునతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ వరదల వల్ల నష్టపోయిన బాధితుల కోసం ఆయన విరాళం అందించారు. వాళ్లకు కలిసిన రెండు రోజులకే ఆయనకు కరోనా పాజిటివ్ తేలడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.

- Advertisement -

Related Posts

ప్ర‌భాస్ ఖాతాలో ఫాస్టెస్ట్ రికార్డ్‌.. అతి త‌క్కువ టైంలో ఆరు మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ సొంతం

రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు న‌ట వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్ర‌భాస్ ఛ‌త్ర‌ప‌తి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇందులో ప్ర‌భాస్ న‌ట‌న‌, ఆయ‌న నోటి నుండి వెలువ‌డిన డైలాగులు ప్రేక్ష‌కుల‌ని...

జాతీయ జెండాను ఆవిష్క‌రించిన చిరంజీవి.. జెండా పండుగ వేడుక‌లో పాల్గొన్న‌ మెగా ఫ్యామిలీ

72వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు దేశవ్యాప్తంగా ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ప్ర‌తి ఒక్క‌రు సంప్ర‌దాయ దుస్తులు ధరించి ఉద‌యాన్నే జాతీయ జెండా ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి త‌ను స్థాపించిన చిరంజీవి బ్ల‌డ్...

‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ .. సెట్స్ లో అడుగుపెట్టిన పవన్ !

టాలీవుడ్ అగ్రనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాణాదగ్గుబాటి ల కాంబినేషన్ లో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం:12 గా నిర్మిస్తున్న చిత్రం రెగ్యులర్...

ఏమయ్యా విజయ్.. ఇవి మిడిల్ క్లాస్ వాళ్ళు కొనేలా ఉన్నాయా?

తెలుగు రాష్ట్రాలలో విజయ్ దేవరకొండకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అలాగే లైగర్ సినిమాతో తన క్రేజ్ ను పక్క రాష్ట్రాల్లో కూడా పెంచుకోవాలని...

Latest News