టాలీవుడ్ లో కరోనా పుణ్యమా తీవ్ర సంక్షోభం నెలకొంది. కొన్ని కోట్ల బిజినెస్ చేసే సినిమాలు ఏవీ ఈ ఏడాది బాక్సాఫీసుకు చేరకపోవడంతో..చిత్ర పరిశ్రమపై ఆధారపడిన చాలా మంది తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. దాదాపుగా 8 నెలల గ్యాప్ తరువాత ఇప్పుడిప్పుడే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలు సెట్స్ మీదకు వెళుతున్నాయి. వచ్చే ఏడాది స్టార్ హీరోల చిత్రాలు ప్రారంభం కానున్నాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం విదేశాల్లో షూటింగ్ ల కోసం ఎదురు చూస్తున్నారు మేకర్స్. అయితే ఆ ప్లాన్ లు ఉంటే వాటికి ఇక బ్రేక్ వేయాల్సిన పరిస్థితి వచ్చిందని లేటెస్ట్ న్యూస్ చూస్తే అర్థమవుతుంది.
అవును ప్రస్తుతం ఫారెన్ కంట్రీస్ లో మళ్లీ కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. అది తీవ్ర రూపం దాల్చుతోందన్న వార్తలు వస్తున్నాయి. అందులోనూ కరోనా కొత్త రకం స్ట్రైయిన్ అనే వైరస్ విజృంభిస్తుండటంతో ప్రపంచదేశాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే బ్రిటన్ లో లాక్ డౌన్ ప్రారంభమయ్యింది. ఇండియాలోనూ పకడ్బంధీ చర్యలు తీసుకుంటున్నారు. అధికారులు సూచిస్తున్న ప్రస్తుత పరిస్థితులలో ఇక ఫారెన్ లో షూటింగ్ లు ఉన్న సినిమాలు పెండింగ్ లో పడేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట చిత్రం షెడ్యూల్ ను అమెరికాలో అనుకున్నారు.
కానీ కరోనా వల్ల అది ఎప్పటినుంచో పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. ఇక దానికి ఫుల్ స్టాప్ పెట్టి లోకల్ గానే పనులు ప్రారంభించాలని సినిమా యూనిట్ భావిస్తోందని టాక్. అలాగే లేటెస్ట్ న్యూస్ తో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పరిస్థితి కన్‌ఫ్యూజన్ లో పడినట్లైందంటున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. విదేశాల్లో షూటింగ్ చేసుకునే చాన్సులు కనిపించడం లేదు. ఎందుకంటే ఈ మూవీకి సంబంధించిన లొకేషన్స్ అన్నీ యూరప్ లోనే ఎంచుకున్నాడట పూరి. ప్రస్తుతం యూరప్ లోనూ కరోనా విలయతాండవం చేస్తుండటంతో పూరి కి మరో అవకాశం లేకుండా పోయిందని సమాచారం.