Vimala Raman:నీవల్లే నీవల్లే.. హీరో తో ప్రేమలో పడ్డ ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్..!

Vimala Raman: ఎవరైనా ఎపుడైనా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా విమలరామాన్ మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.మలయాళ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించిన ఆమె తెలుగులోనూ అనేక చిత్రాలు చేసింది. ఎవరైనా ఎపుడైనా, కులుమనాలి, రాజ్‌, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, చట్టం వంటి పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.అయితే విమలరామాన్ తెలుగులో అగ్రహీరోలతో నటించలేదు.ఇదిలా ఉంటే త్వరలోనే ఆమె పెళ్లిపీటలెక్కనున్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక నీవల్లే నీవల్లే తమిళ మాతృక ఉన్నాలే ఉన్నాలే సినిమా లో హీరో గా నటించినా వినయ్ రాయ్ అమ్మాయిల గుండెలను ఆ సినిమాతోనే కొల్లగొట్టాడు. ఈ హీరో తోనే ఏడడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. వినయ్ రాయ్ జయం కొందాన్‌, ఎంద్రెంద్రమ్‌ పున్నగై వంటి పలు హిట్‌ చిత్రాల్లో కథానాయకుడిగా నటించాడు. తుప్పరివలన్‌ సినిమాలో విశాల్‌ను ఢీ కొట్టే విలన్‌గానూ అదరగొట్టాడు. డాక్టర్‌, ఈటీ చిత్రాల్లో నెగెటివ్‌ పాత్రలతో ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఇక హీరో కమ్ విలన్ తో పీకల్లోతూ ప్రేమలో ఉంది విమల రామన్ .

ఇటీవల ఇద్దరు కలిసి మాల్దీవులు ట్రిప్ కి వెళ్లి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.తరచూ వీళ్లిద్దరూ విహారయాత్రలకు వెళ్తుంటారు. ఇక ఈ జంట ఇపుడు పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.