వైరల్ అవుతున్న సమంత మార్క్ షీట్?

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సమంత గురించి తెలియని వారంటూ ఉండరు. ఇంతకాలం సౌత్ ఇండస్ట్రీలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషలలో స్టార్ హీరోల సరసన నటించిన సమంత ఇప్పుడు నార్త్ లో కూడా వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఇటీవల పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించిన సమంత ఆ సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. దీంతో బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడికి వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. అందువల్ల చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సామంత ముంబైకి తన మకాం మార్చింది.

ఈ క్రమంలో బాలీవుడ్ లో ఎంతో మంచి గుర్తింపు పొందిన కాఫీ విత్ కరణ్ అనే రియాలిటీ షోలో కూడా ఇటీవల సమంత పాల్గొనింది. ఈ షోలో అనసూయ ఎన్నో ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. కొన్ని సందర్భాలలో కరణ్ అడిగిన ప్రశ్నలకు సమంత చెప్పిన సమాధానం విని ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇక ఈ షోలో సమంత పర్సనల్ లైఫ్ గురించి ప్రస్తావిస్తూ చైతన్యతో మీరు ఇప్పటికీ సఖ్యత గానే ఉన్నారా అని అడగ్గా మా ఇద్దరిని ఒకే రూమ్లో ఉంచితే చేతిలో ఆయుధాలు లేకుండా చూసుకోవాలి అంటూ సమాధానం ఇచ్చింది. అంతేకాకుండా సమంత విడాకులు కోసం నాగచైతన్య నుండి 250 కోట్లు బరివంగా తీసుకుందని వస్తున్న వార్తలపై స్పందిస్తూ ఆ వార్తలలో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత చిన్నప్పుడు స్కూల్లో కూడా చదువులో ముందుండేది. ఇటీవల సమంత 10వ తరగతి మార్క్ షీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్నప్పుడు సమంత చెన్నైలోని CSI సెయింట్ స్టీఫెన్స్ మెట్రిక్యులేషన్ స్కూల్‌లో పదవ తరగతి వరకు చదువుకుంది. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఉన్న సమంత అప్పుడు స్కూల్లో కూడా ఎప్పుడు టాపర్గా నిలిచేదని సమాచారం. ఇటీవల వైరల్ అవుతున్న సమంత టెన్త్ క్లాస్ మార్క్స్ షీట్ లో గణితంలో 100కి 100 మార్కులు ఫిజిక్స్‌లో 100కి 95 మార్కులు సాధించారు. ఇక ఈ షీట్ లో స్కూల్‌కి సమంత గర్వకారణం టీచర్ కామెంట్ కూడా ఇచ్చారు. .