బోల్డ్ ఫర్పార్మెన్స్ లో కియారానే తొక్కేస్తుందట ..ఈ టాలీవుడ్ బ్యూటీ..?

భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ కి పరిచయమై బ్యూటీ కియారా అద్వాని. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ లో బాగా ఫేమస్ అయింది. ఐతే ఇక్కడ డేట్స్ ఇవ్వలేనంతగా బాలీవుడ్ లో బిజీ అయింది. కేవలం ఒకే ఒక్క లస్ట్ స్టోరీస్ అన్న అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కిన వెబ్ సిరీస్ కియారా ఫేట్ ని మార్చేసింది. ఆ తర్వాత అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్. ఇక బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. ముందు చేసిన ఎస్.ఎస్ ధోనీ కంటే కియారా కి లస్ట్ స్టోరీస్ తో వచ్చిన క్రేజ్ కి వరసగా భారీ ప్రాజెక్ట్స్ లో ఛాన్స్ అందుకుంటంది.

Here's what 'Lust Stories' actress has to say about women's desire on screen

అయితే ఇప్పుడు అదే వెబ్ సిరీస్ తెలుగులో రీమెక్ అవుతోంది. టాలీవుడ్ దర్శకులు ఒక్కొక్కరు ఒక్కో భాగాన్ని రూపొందిస్తున్నారు. కాగా ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఈ సిరీస్ లో ఒక ఎపిసోడ్ తయారవుతుండగా తెలుగమ్మాయి ఈషా రెబ్బ నటిస్తోంది. అంతేకాదు కియారా చేసిన పాత్రని తెలుగులో ఈషా పోషిస్తుండటంతో గత కొన్ని రోజులుగా ఈ వెబ్ సిరీస్ గురించి టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది.

అయితే అందరూ ఇప్పుడు చర్చించుకుంటుంది తెలుగమ్మాయి ఈషా.. కియారా ని మించి చేస్తుందా అన్న విషయం. కాని ఈషా మాత్రం అందరికీ షాకివ్వబోతుందని సమాచారం. లస్ట్ స్టోరీస్ తెలుగు రీమేక్ లో కియారా ని మించి బోల్డ్ గా అద్భుతంగా పర్ఫార్మ్ చేసిందని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ తర్వాత ఈషా కి టాలీవుడ్ లో మంచి క్యారెక్టర్స్ వరసగా వస్తాయని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఈ తెలుగమ్మాయి ఎంతవరకు సక్సస్ అవుతుందో. ఇక ఇప్పటికే పలు సినిమాలలో హీరోయిన్ గా నటించిన ఈషా కి క్రేజ్ బాగానే ఉంది.