చి ఛీ దరిద్రం .. ఆఫర్ల కోసం హీరోని కూడా పడుకుంటావా అని అడిగారు.

చి ఛీ దరిద్రం .. ఈ మాట ఎంత అసహ్యమైన పరిస్థితులను చూస్తే అంటామో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ విషయంలో ఇప్పటికే ఎన్నో కథనాలు వచ్చి సెన్షేషనల్ న్యూస్ గా మారాయి. ప్రతీ సినిమా ఇండస్ట్రీలో చిన్న ఆర్టిస్టుల నుంచి స్టార్ హీరోయిన్స్ వరకు పలువురు అవకాశాల కోసం కమిట్‌మెంట్ అడిగిన సందర్భాలు కోకొల్లలని గత కొంతకాలంగా ఈ విషయాలలో తీవ్ర ఇబ్బందులను ఎదురొన్న కొందరు సోషల్ మీడియా ద్వారా పలు యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా బయట పెట్టిన సంగతి తెలిసిందే.

అవకాశం కావలంటే కాంప్రమైజ్ కాక తప్పదని ప్రముఖ నటీమణులే బయట పడ్డ సందర్భాలు ఈ మధ్య కాలంలో చాలానే ఉన్నాయి. అయితే ఇది కేవలం అమ్మాయిలు, హీరోయిన్స్ విషయంలోనే కాదు .. హీరోల విషయంలో కూడా తరచూ జరిగేదే అని తాజా గా వెల్లడైన ఒక సంఘటన చూస్తే అర్థమవుతోంది. అసలు కాస్టింగ్ కౌచ్ ఉందా అని కొందరి కొట్టిపారేస్తూ అనుమానాలని వ్యక్తపరుస్తున్నప్పటికీ ఇది వాస్తవం అని టాలీవుడ్ యంగ్ హీరో ద్వారా తెలుస్తోంది. అతనెవరో కాదు మల్టీ టాలెంటెడ్ యంగ్ హీరో అడవి శేష్.

Mahesh Babu makes Adivi Sesh Hero of Mumbai Attack – Major - tollywood

అడవి శేష్ ..అని ఆశ్చర్యపోతున్నారా .. ఎస్ .. మీరు చదివింది కరెక్టే. అలాంటి నీచమైన అనుభవం ఎదురైంది మన టాలెంటెడ్ టాలీవుడ్ హీరో అడవి శేష్ కేనట. పవన్ కళ్యాణ్ నటించిన పంజా.. దర్శక ధీరుడు తెరకెక్కించిన బాహుబలి సినిమాలలో నటించి మంచి నటుడిగా పేరు తెచ్చుకొని క్షణం సినిమాతో హీరోగా పాపులారిటీ తెచ్చుకున్న అడవి శేష్ ఆ తర్వాత అవకాశాల కోసం ముంబై వెళ్ళి ప్రయత్నించాడట. ఈ క్రమంలో కొందరు మేకర్స్ తనని కమిట్‌మెంట్ అడిగారని షాకింగ్ విషయాన్ని బయటపెట్టి హాట్ టాపిక్ అయ్యాడు. అయితే అలా అడిగిన వాళ్ళ పేరు మాత్రం బయట పెట్టలేదు. ప్రస్తుతం అడవి శేష్ మహేష్ బాబు సోని పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్న మేజర్ సినిమాలో నటిస్తున్నాడు.