Mahesh Babu : సర్కారు వారి పాట నుండి మరో పాట…. ఆకట్టుకుంటున్న లిరిక్స్…!

Mahesh Babu : మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా విడుదల కోసం సిద్ధం అవుతున్నారు. ఇక ఈ సినిమాకు పరుశురామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయినా ఇంకా చిన్న చిన్న పనులు ఉండటంతో విడుదల జాప్యం జరుగుతోంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నారు. ఇక రాజమౌళి సినిమా కోసం కూడా మహేష్ సిద్ధమవుతున్నాడు. ఈ ఏడాది చివరకు స్క్రిప్ట్ పనులు పూర్తి చేయాలని రాజమౌళి భావిస్తున్నారట.

ఇక మహేష్ సినిమా సర్కారు వారి పాట సినిమా విడుదలకు సిద్ధం అవుతున్న వేళ చిత్రం యూనిట్ మరో పాటను విడుదల చేసింది.సర్కారు వారి పాట నుండి టైటిల్ సాంగ్ ను విడుదల చేసారు మేకర్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు , మహానటి ఫేమ్ కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. సరా సరా సరా సరా సర్కారు వారి పాట.. షురూ షురూ అన్నాడు రా అల్లూరి వారి బేటా.. సరా సరా సరా సరా సర్కారు వారి పాట.. ఇరా గిరా గిస్తాడు రా ఇవ్వాల్సినోడి కోటా..’ అంటూ సాగిన ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

YouTube video player

సామాజిక మధ్యమాల్లో అపుడే సర్కారు వారి పాట సందడి మొదలయింది. థమన్ బీట్స్ అభిమానులకు తెగ నచ్చేసాయి. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుని సినిమా విడుదలకు సిద్ధమైంది. సింగర్ హారిక నారాయణ హై పిచ్ గాత్రం పాటకు మరింత జోష్ ని ఇచ్చింది. హీరో పాత్ర గురించి వర్ణించే ఈ పాట మొత్తానికి సూపర్ స్టార్ అభిమానులకు సూపర్ గా నచ్చేసింది.మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బీ ఎంటర్టైన్మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.