మహేష్ బాబు- రాజమౌళి సినిమాకు టైటిల్‌!

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు తన తదుపరి సినిమా అగ్ర దర్శకుడు ఎస్‌. ఎస్‌ రాజమౌళి తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఇప్పటికే స్క్రిప్ట్‌ పని పూర్తయిందని రాజమౌళి తండ్రి, ఈ సినిమాకి కథా రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్‌ పలు మీడియా ఇంటర్వ్యూ లో చెప్పిన సంగతి కూడా తెలిసిందే. ఈ సినిమా కథా నేపధ్యం ఒక అడ్వెంచర్‌ లా ఉంటుంది అని ఇంతకు ముందు రాజమౌళి చెప్పారు.

మహేష్‌ బాబుతో చేస్తున్న సినిమా ఒక యాక్షన్‌ సినిమాగా ఉంటుందని, అది జేమ్స్‌ బాండ్‌ తరహాలో లేదా ఇండియానా జోన్స్‌ తరహాలో ఉంటుందని, అయితే అది భారతీయ సంస్కృతి ఆధారంగా నిర్మితమై ఉంటుందని రాజమౌళి ఇంతకుముందు ఒక మీడియా సంస్థలతో మాట్లాడుతూ చెప్పారు.

ఈ సినిమా కోసమే ఈమధ్యనే మహేష్‌ బాబు జర్మనీ వెళ్లి కొన్ని రోజులు శారీరక శిక్షణ పొందిన సంగతి కూడా తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఈ సినిమా టైటిల్స్‌ గురించి వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఈ సినిమాకి రెండు పేర్లను అనుకుంటున్నట్టుగా అందులో ఒకటి ‘మహారాజా’ ఇంకోటి ‘చక్రవర్తి’ అని ఇలా వైరల్‌ అవుతున్నాయి.

అన్ని భాషలకి ఇవే టైటిల్స్‌ ఖరారు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ అధికారికంగా ఈ మహేష్‌ బాబు, రాజమౌళి సినిమా గురించి ఎటువంటి సమాచారం లేదు కానీ, రోజూ ఈ సినిమా గురించి కొన్ని వార్తలు మాత్రం సామాజికమాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమా టైటిల్స్‌ గురించిన వార్తలు వైరల్‌ అవుతున్నాయి.