మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాపై అంచనాలు రోజు రోజుకు గట్టిగానే పెరిగిపోతున్నాయి. స్టువర్టుపురం గజదొంగ జీవిత ఆధారంగా తెరపైకి రాబోతున్న ఈ సినిమాపై మొదటి నుంచే ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. అంతేకాకుండా రవితేజ ఫస్ట్ లుక్ కూడా విడుదలైన తర్వాత మరింత ఆసక్తి కలిగింది.
తప్పకుండా ఈ సినిమాతో రవితేజ బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ సక్సెస్ అందుకోబోతున్నట్లు కూడా అనిపిస్తోంది. ఇక ఈ సినిమాను ఫ్యాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే విడుదల చేయాలని అనుకుంటున్నారు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.
అయితే సినిమా టీజర్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా మార్కెట్లో ఈ సినిమాకు మంచి డిమాండ్ అయితే పెరిగింది. ఇక ఇప్పుడు నిర్మాతలకు అన్ని ఏరియాల నుంచి మంచి డీల్స్ లభిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 30 కోట్ల రేంజ్ లో బిజినెస్ డీల్స్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా కేవలం తెలుగు వెర్షన్ లోనే 50 కోట్ల రేంజ్ లో థియేట్రికల్ గా బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి మిగతా భాషల్లో ఈ సినిమాకు ఎలాంటి రేట్లు అందుతాయో చూడాలి.