మెగా అప్డేట్ – కీర్తీ లవర్ గా ఈ యువ హీరో.!

ప్రస్తుతం టాలీవుడ్ మరియు కోలీవుడ్ యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ పలు క్రేజీ సినిమాలతో రెడీ గా ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో ఈ నెలలో రిలీజ్ కి రాబోతున్న దసరా ఒకటి కాగా చివరగా అయితే ఈ హీరోయిన్ “సర్కారు వారి పాట” లో కనిపించింది. ఇక వీటితో పాటుగా ఓ మెగా ప్రాజెక్ట్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న అవైటెడ్ సినిమా “భోళా శంకర్” లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమాలో అయితే కీర్తి చిరంజీవికి సోదరి పాత్రలో నటిస్తుంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా చిత్ర యూనిట్ ఓ మెగా అప్డేట్ ఇచ్చారు. అక్కినేని వారి యంగ్ హీరో సుశాంత్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్టుగా తాజాగా అనౌన్స్ చేయగా ఈ సినిమాలో సుశాంత్ రోల్ ఏంటి అనేది తెలుస్తుంది.

కాగా ఈ సినిమాలో సుశాంత్ అయితే కీర్తి సురేష్ కి లవర్ గా కనిపించనున్నాడట. సినిమాలో మంచి స్పేస్ కూడా ఈ యువ హీరోకి దక్కినట్టుగా సినీ వర్గాల నుంచి టాక్. దీనితో అయితే ఈ సినిమా మరింత ఇంట్రెస్టింగ్ గా ఇప్పుడు మారుతుంది.

కాగా ఈ సినిమాలో చిరు సరసన అయితే మిల్కి బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా మేకర్స్ ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుపుతున్నారు. కాగా ఈ సినిమాని అనీల్ సుంకర నిర్మాణం వహిస్తుండగా ఈ ఏడాది వేసవి కానుకగా రిలీజ్ చేసే ప్లాన్ లలో చిత్ర యూనిట్ ఉన్నట్టుగా సమాచారం.